మేడ్చల్: హైదరాబాద్ నగర శివార్లలో ని ఉద్దమర్రి వైన్ షాప్ లో కాల్పులు జరిపి నగదు దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు అంతర్రాష్ట్ర దోపిడి దొంగలు గా గుర్తించారు. రాజస్థాన్ భరత్ పూర్ ముఠా పట్టుకున్నట్లుగా మేడ్చల్ డిసిపి సందీప్ రావు తెలిపారు. నిందితుల నుండి నగదు, రెండు సెల్ ఫోన్స్, గన్, మూడు 3 తూటాలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించారు.