Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వైకాపా విజయానికి కృషి చేయాలి

0

మదనపల్లె
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి 175 స్థానాల్లో గెలుపొందే విధంగా ప్రతి ఒక గృహసారధి, కన్వీనర్లు కృషి చేయాలని అన్నమయ్య జిల్లా మదనపల్లే ఎమ్మెల్యే నవాజ్ భాషా పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె రూరల్ మండలం బసినికొండ పంచాయతీలోని ఓ ప్రయివేటు ఫన్షన్ హాలు నందు గృహ సారధుకలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ వైసిపి ఎన్నికల పరిశీలకులు హబీబ్ భాష, వైస్ ఎంపిపిలు డిష్ రమణ, నందినీతాజ్, సర్పంచులు శరత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తట్టిశ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సచివాలయ పరిధికి ముగ్గురు కన్వీనర్లు, ప్రతి 50 మందికి ఒక గృహ సారధిని నియమించిన్నట్లు తెలిపారు. వీరు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి తెలియజేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie