A place where you need to follow for what happening in world cup

HOT NEWS

Actor Vishal తిరుపతి నుంచి విశాల్‌ పోటీ..?

0

Vishal Laatti Movie Promotions ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ అంటే తనకు చాలా ఇష్టమని ఐ లవ్‌ జగన్‌ అని హీరో విశాల్‌ అన్నారు. లాఠీ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా తిరుపతి వచ్చిన విశాల్‌ తాను కుప్పం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానన్న ప్రచారాన్ని ఖండిరచారు. తన తండ్రి కుప్పంలో వ్యాపారం చేసే వారిని సినిమాల్లోకి రాక ముందు తండ్రికి సాయంగా కుప్పంలోనే ఉండేవాడినని తెలిపారు. కుప్పంలో ప్రతి వీధి తనకు బాగా తెలుసని అన్నారు. తనకు ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ సంపాదన, ఎక్కువ ప్రజాభిమానం ఉందని అన్నారు. తాను ఏపీ రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. లాఠీ సినిమా ప్రతి టికెట్‌ ఆదాయంలో ఒక రూపాయి పక్కన పెట్టి రైతులకు సాయం చేస్తానని తెలిపారు.

సోషల్‌ సర్వీస్‌ చేసే ప్రతి వ్యక్తి రాజకీయ నాయకుడేనని, అలా తాను ప్రజలకు సేవ చేస్తున్నానని తెలిపారు. నటుడు కాక ముందు కుప్పంలో పనిచేశాను. మా నాన్న కాంట్రాక్టర్‌ గా ఉన్నప్పుడు కుప్పంలో ప్రతి వీధి తిరిగాను. నేను కుప్పం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజకీయాలంటే సోషల్‌ సర్వీస్‌ అన్నారు. అందరం పొలిటీషియన్సే అన్నారు. సాయం చేసే ప్రతీ వ్యక్తి పొలిటీషియన్స్‌ అన్నారు. లాఠీ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో టికెట్‌ పై ఒక రూపాయి రైతులకు సాయం చేస్తాను. ఈ సినిమాను అందరి కానిస్టేబుల్‌ కుటుంబాలకు చూపించాలని కోరిక. ఐ లవ్‌ జగన్‌. భవిష్యత్‌ లో ఏపీ నుంచి పోటీ చేయనన్నారు. పోటీ అంటే హీరోలతోనే అన్నారు.

అందరూ మెచ్చుకునే సినీ పరిశ్రమలో ఉన్నాను. ఇంతటి అభిమానాన్ని నేను కోల్పోలేను. ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అభిమానాన్ని నేను సంపాధించుకున్నాను.’’ ` హీరో విశాల్‌ తమిళంలో హీరోగా నిలదొక్కుకున్న తెలుగు కుటుంబానికి చెందిన విశాల్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి వస్తున్నారని, కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తారన్న ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. ఈ ప్రచారాన్ని విశాల్‌ గతంలో కూడా ఖండిరచారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదన్నారు. ఈ విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని, అయినా ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయో తనకు తెలియదన్నారు. తన ప్రాధాన్యం సినిమాలకు మాత్రమేనన్నారు. ఏపీ రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబుపై పోటీ చేసే ఉద్దేశంలేదన్నారు. నెల్లూరుకు చెందిన విశాల్‌ రెడ్డి కుటుంబం చెన్నైలో స్థిరపడిరది. ఆ కుటుంబానికి వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే కుప్పం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా భరతే ఉంటారని ఇప్పటికే సీఎం జగన్‌ ప్రకటించారు. బీసీలు అత్యధికంగా ఉన్న కుప్పం నుంచి బీసీ వర్గానికి చెందిన చంద్రమోళిని ప్రోత్సాహించామని జగన్‌ తెలిపారు. ఆయన చనిపోవడంతో చంద్రమోళి కుమారుడు భరత్‌ ప్రోత్సహిస్తున్నానన్నారు. భరత్‌ను గెలుపించుకు వస్తే మంత్రిని కుప్పానికి ఇస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.