ఆర్టీసి చైర్మన్ బాజిరెడ్డిని కలిసిన వెల్ఫేర్ బోర్డు మెంబర్ ఎజాజ్
Welfare Board Member Ejaz met RTC Chairman Bajireddy
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ను మెదక్ డిపో ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు సభ్యులు మహమ్మద్ ఎజాజ్ శుక్రవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి ఆర్టిసి కార్మికులకు జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్, సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.