Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కేసీఆర్ 420..రేవంత్ జైలుకు పోయిన దొంగ షర్మిల

0

పాలకుర్తి: పాలకుర్తిలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి  వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం లభించింది. బుధవారం ఆమె  స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. షర్మిల మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ తెచ్చుకోలేనొడు మంత్రి అంట. పాలకుర్తి,చెన్నూరు రిజర్వాయర్ లతో వైఎస్సార్ సాగునీరు ఇద్దాం అనుకున్నారు. ఇప్పటికీ ఈ రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయలేక పోయారు. టిడిపి లో ఉన్నప్పుడు కేసీఅర్..రాక్షసుడు..ఇప్పుడు దేవుడా.. అని ప్రశ్నించారు.

పాలకుర్తిలో రేవంత్ పాదయాత్ర చేస్తున్నాడా..? కార్ యాత్ర చేస్తున్నాడా..? . పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు. పంచాయతీలు ఎలా నడపాలి అంటే మీ మంత్రి ఒక మాట అన్నాడు.  ఖాళీగా ఉన్న బీరు బాటిళ్లు అమ్ముకోవాలి అన్నాడు.  సర్పంచులకు నిధులు ఇవ్వక ఇబ్బందులు పెడుతున్నారు.  ఇదే పాలకుర్తి నియోజక వర్గానికి వైఎస్సార్ హయాంలో 70వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అనుకున్నారు.  చెన్నూరు,పాలకుర్తి రిజర్వాయర్ లకు అనుమతులు ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభం అయిన ఈ రిజర్వాయర్లను ఇప్పటికీ పూర్తి చేయలేదు.

నియోజక వర్గంలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదు.  కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు.  మంత్రి అయ్యి ఉండి డిగ్రీ కాలేజీ కూడా తెచ్చుకొలేని మంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అని అన్నారు.
పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏమయ్యింది..?  కనీసం పోస్ట్ మార్టం చేసే గది కూడా లేదు.  కొలుకొండ గుట్టలను సైతం గ్రానైట్ కంపెనీలకు పట్టాలు చేయించాడట.  100ల ఎకరాలు ఈ మంత్రి కి ఉన్నాయట..లక్షల కొద్దీ రైతు బందు తీసుకుంటున్నాడట. టిడిపి లో ఉన్నప్పుడు కేసీఅర్ ను రాక్షసుడు అన్నాడు.  తెరాస లో చేరిన తర్వాత కేసీఆర్ దేవుడు అయ్యాడు.

కేసీఅర్ దేవుడు అయితే మీ నియోజక వర్గంలో ఎక్కడ అభివృద్ది అని నిలదీసారు. వైఎస్సార్ ను పాలకుర్తి ప్రజలు  ఇంకా గుర్తుపెట్టుకొనే ఉన్నారు.  వైఎస్సార్ పథకాలు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచే ఉన్నాయి.  వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం అద్భుతమే.  అన్ని వర్గాల ప్రజలను గుండెల్లో పెట్టుకున్నారు.  ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్.  ఇప్పుడున్నడు 8 ఏళ్ల ముఖ్యమంత్రి కేసీఆర్.  కేసీఅర్ తో పాలకుర్తి నియోజక వర్గానికి ఏమైనా ఒరిగిందా..? . రుణమాఫీ అని మోసం చేశాడు. ఒక్కరికైన రుణమాఫీ అయిందా..?  సున్నా వడ్డీకే రుణాలు అని మోసం.  ఉచిత విద్య అని మోసం.  ఇంటికో ఉద్యోగం అని మోసం.  డబుల్ బెడ్ రూం ఇళ్లులు అని మోసం.  అల్లుడు వస్తె ఎక్కడ పడుకోవాలి అని మోసం.  డబుల్ బెడ్ రూం ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి.  మూడు ఎకరాల భూమి అని మోసం. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు అని మోసం.  అన్ని మోసాలే. అందుకే కేసీఅర్ 420.  మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఅర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పులు చేశారు.  ఇంత అప్పులు చేసి దేనికి డబ్బు లేదు.  ఇంత అప్పు చేసి బీడీ బిచ్చం కల్లు ఉద్దెర.  చేసిన అప్పులు అన్ని ఎక్కడ పోయాయనిఅడిగారు.

బంగారు తెలంగాణ అని చెప్పి బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణ చేశారు.  కేసీఅర్ కొడుకు,బిడ్డ, అల్లుడు, ఆయన మంత్రులు,ఎమ్మెల్యే కు తప్ప ఎవరు బాగుపడలేదని అన్నారు. మంచోడు అనుకుంటే కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయాడు.  ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు.  ప్రజల సమస్యలు ఎత్తి చూపిస్తూ పాదయాత్ర చేస్తున్నాం. ఇదే నియోజక వర్గంలో రేవంత్ సైతం పాదయాత్ర చేస్తున్నాడు. ఈయన పాదయాత్ర కాదు..కార్ యాత్ర చేస్తున్నాడు అని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. ఇంత దానికి పాదయాత్ర అని చెప్పడం ఎందుకు..? రేవంత్ ఓటుకు నోటు లో దొరికిన దొంగ. ఈయన సోనియా చెప్పినట్లు వింటాడా… కేసీఅర్ చెప్పినట్లు వింటాడా..? రేవంత్ పిలక కేసీఅర్ చేతిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కి అసలు ఓట్లు ఎందుకు వేయాలి. కాంగ్రెస్ లో గెలిచి అందరూ కేసీఅర్ కి అమ్ముడు పోయారు. అమ్ముడు పోయే పార్టీకి ఓట్లు వేయడం అవసరమా అని ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie