Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

YS Viveka second wife Shamim వైఎస్​ వివేకా రెండో భార్య షమీమ్​ స్టేట్​మెంట్​ కాపీలో కీలక అంశాలు

0

వైఎస్​ వివేకా రెండో భార్య షమీమ్​ స్టేట్​మెంట్​ కాపీలో కీలక అంశాలున్నాయి. వివేకాతో 2010 లో ఆమెకు పెళ్ళయింది. 2011 లో మరోసారి పెళ్ళి చేసుకున్నారు. 2015లో కొడుకు హెహన్​షా పుట్టాడు. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా షమీమ్​తో ఫోన్​లో మాట్లాడాడు.  మా వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని షమీమ్​ చెప్పింది. శివప్రకాశ్​ రెడ్డి తనను చాలాసార్లు బెదిరించాడని చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులను కూడా శివప్రకాశ్​ రెడ్డి బెదిరించాడు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి కూడా బెదిరించేది.

వివేకా ఆస్తిపై సునీత భర్త రాజశేఖర్​కు కాంక్ష ఉండేది. కొడుకు హెహన్​షా పేరుతో నాలుగు ఎకరాలు కొనాలని వివేకా అనుకున్నారు. వివేకాను సొంత కుటుంబ సభ్యులే దూరం పెట్టారు. అన్యాయంగా ఆయన చెక్​ పవర్​ తొలగించారు. చెక్​ పవర్​ తొలగించడంతో వివేకా ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. బెంగళూరు ల్యాండ్​ సెటిల్​మెంట్​తో రూ.8 కోట్లు వస్తాయని వివేకా అన్నారు. హత్యకు కొన్ని గంటల ముందు కూడా రూ.8 కోట్ల గురించి వివేకా మాట్లాడారని షమీమ్​ చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie