Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

 కాంగ్రెస్ లోకి ఈటెల రాజేందర్ ?

0

కరీంనగర్, ఫిబ్రవరి 19 (న్యూస్ పల్స్)
బీజేపీ మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారా.. కొన్ని రోజులుగా పార్టీలో
సర్దుకు పోతున్న ఆయన అధికార కాంగ్రెస్‌వైపు చూస్తున్నారా.. గత కొద్ది
రోజులుగా మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా.. హస్తం గూటికి చేరేందుకు
ముహూర్తం కూడా ఫిక్స్‌ చేసుకున్నారా అంటే అవునే సమాధానం వస్తోంది
కాంగ్రెస్‌ వర్గాల నుంచి. కరీంనగర్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి
సంజయ్, ఈటల రాజేందర్‌కు మధ్య పొసగడం లేదని చాలాకాలంగా ప్రచారం
జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని బండి ఇటీవల ఖండించారు. కానీ అనుచరులు
మాత్రం వర్గాలుగా విడిపోయారు. ఇక మరోవైపు బీజేపీ తరఫున 2023 అసెంబ్లీ
ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ హుజూరాబాద్, గజ్వేల్‌ నుంచి పోటీ చేసి
ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి సీటు ఆశిస్తున్నారు. అయితే
మల్కాజ్‌గిరి టికెట్‌ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదని
సమాచారం.మల్కాజ్‌గిరి టికెట్‌ను బీజేపీ నిరాకరించడంతో తనకు బలమైన
క్యాడర్‌ ఉన్న కరీంనగర్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని ఈటల కోరుతున్నారు. ఇక్కడ
కూడా బండి సంజయ్‌ను కాదని ఇతరులకు టికెట్‌ ఇచ్చే అవకాశం లేదని కమలనాథులు
క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈటల బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. ఈ
నేపథ్యంలోనే ఆయన పార్టీ మారతారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.తాజాగా
ఆయన కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైందని, పార్టీ మారేందుకు ముహూర్తం కూడా
ఫిక్స్‌ చేసుకున్నారని వార్తలు మరోమారు చెక్కర్లు కొడుతున్నాయి. ఈమేరు
ఇటీవల బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి హన్మంతరావు, పట్నం
మహేందర్‌రెడ్డి ఈటలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది.
ఇటీవల ముగ్గురూ సమావేశమయ్యారని తెలుస్తోందికరీంనగర్‌ ఎంపీగా పోటీ
చేసేందుకు కాంగ్రెస్‌కు బలమైన నాయకుడు లేడు. దీంతో ఈటలను కాంగ్రెస్‌లో
చేర్చుకుని ఎంపీగా పోటీ చేయించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. గతంలో
పొన్న ప్రభాకర్‌ కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. తర్వాత బోయినపల్లి వినోద్‌
బీఆర్‌ఎస్‌ నుంచి బండి సంజయ్‌ బీజేపీ నుంచి గెలిచారు. తాజాగా పొన్నం
ప్రభాకర్‌ హుస్నాబాద్‌కు మారారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు.
కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంత రావు, మాజీ మంత్రి పట్నం
మహేందర్‌రెడ్డితో బీజేపీ నేత, హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
భేటీ అయ్యారు. ఒక చోట కలిసి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. కాంగ్రెస్
నేతలతో ఈటల రాజేందర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
కొద్దీ రోజులుగా ఈటల రాజేందర్ బీజేపీ హైకమాండ్ మీద అసంతృప్తితో ఉన్నారని
అంటున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఆయన టిక్కెట్
అడుగుతున్నారు. కానీ హైకమాండ్ ఏదీ తేల్చడం లేదు.  ఈటల రాజేందర్ మాత్రం
ఇవేవి పట్టించుకోకుండా మల్కాజ్‌గిరిలో ప్రజలకు చేరువయ్యేందుకు
ప్రయత్నిస్తున్నారు.  వివిధ కార్యక్రమాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ
అధిష్టానానికి సంకేతాన్ని పంపుతున్నారు. ముఖ్యంగా యువతను ఆకట్టుకునేందుకు
ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఈటల ఫర్
మల్కాజ్‌గిరి’ క్రికెట్ ట్రోఫీని ఆయన అనుచరులు స్టార్ట్ చేశారు. అయితే
దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కూడా స్వయంగా తన నివాసంలో ఈటల రాజేందర్
రిలీజ్ చేశారు. ఈటలకే మల్కాజ్‌గిరి టికెట్ రాబోతున్నట్లు ఆయన అనుచరులు
చెబుతున్నారు. దీంతో మరోసారి ఈటల దుమారం తెరపైకి వచ్చింది. ఎంపీగా పోటీపై
బీజేపీ అధిష్టానం నిర్ణయం కంటే ముందే అనుచరుల పేరుతో తానే కార్యక్రమాలు
ఏర్పాటు చేస్తున్నారని పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.అంశంపై
పార్టీ నేతలు హైకమండ్ కు పిర్యాదులు చేశారు. ఇప్పటికి హైకమాండ్ ఎలాంటి
నిర్ణయం తీసుకోలేదు. గతంలో ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినా పార్టీ
పరిస్థితి మెరుగుపడలేదు. ఈటల సూచనల మేరకే బీసీ సీఎం నినాదాన్ని
అందుకున్నారని కూడా అంటున్నారు. అయితే బీసీసీ సీఎం నినాదం ఇచ్చినా ఎల్పీ
నేతగా మళ్లీ రెడ్డి వర్గానికే పదవి ఇచ్చారు. దీనిపైనా ఈటల అసంతృప్తి గా
ఉన్నారంటున్నారు. ఇలాంటి సమయంలో  కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యి చాలా సేపు
చర్చలు జరపడంతో త్వరలో ఆయన కమలం పార్టీ గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో
చేరుతున్నట్లు చర్చ జోరందుకుంది.  త్వరలో కాంగ్రెస్ పార్టీలో ఈటల
రాజేందర్ చేరుతారనే చర్చకు.. అలాగే కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంపై ఈటల
వర్గం క్లారిటీ ఇచ్చింది. పార్టీ మారుతారని వస్తున్న వార్తలను
ఖండించింది. కార్పొరేటర్‌ కొప్పుల నరసింహారెడ్డి గృహ ప్రవేశంలో అందరూ
కలిశారని.. అంతే కానీ రాజకీయాలపై చర్చలు చేసేందుకు కాదని వివరణ ఇచ్చింది.
దీనిపై ఈటల రాజేందర్ మాత్రం ఇప్పటికి స్పందించక పోవడంతో  తెర వెనుక ఏదో
జరుగుతోందన్న అభిప్రాయానికి వస్తున్నారు.ఇక కరీంనగర్‌ జిల్లాలో ఈటల
రాజేందర్‌కు మంచి క్యాడర్‌ ఉన్నందున ఆయన అయితేనే బండి సంజయ్‌ను
ఎదుర్కొంటారని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమలంలో సర్దుబాటు
కాలేక ఇబ్బంది పడుతున్న ఈటల రాజేందర్‌ మరి కాంగ్రెస్‌లోకి వెళ్తారా లేదా
అనేది చూడాలి

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie