Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఇండియా కూటమి నుంచి మరో పార్టీ ఔట్

ఎన్డీయేతో జత కట్టనున్న నేషనల్ కాన్ఫరెన్స్  పార్టీ

0

న్యూఢిల్లీ, ఫిబ్రవరి  16, (న్యూస్ పల్స్)
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా (I.N.D.I.A.) కూటమికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే నితీశ్ కుమార్ జారిపోగా…దీదీ కూటమిపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇప్పుడు తాజా కూటమి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్  పార్టీ బయటకు వెళ్లింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ చీఫ్ ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. అంటే భవిష్యత్ లో తిరిగి ఎన్డీఏలో చేరనున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు అత్యంత నమ్మకమైన భాగస్వామి చేయిజారిపోవడంతో..ఇక మిగిలిన కూటమి సభ్యులు ఏమాత్రం కలిసికట్టుగా ఉంటారన్నది ప్రశ్నార్థకమే.ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్నికల ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జమ్ము, కశ్మీర్ కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్  అలియన్స్ నుంచి బయటకు వచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో తిరిగి ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఫారుక్ అబ్దుల్లా ప్రకటించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్వతహాగా పోటీ చేస్తామన్నారు.సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ఏర్పడిన ఇండియా కూటమికి అనతికాలంలోనే బీటలు వారాయి. కూటమి నుంచి ఒక్కో కీలక పార్టీ బయటకు పోతోంది. ఇప్పటికే జేడీయూచీఫ్ ఎన్డీఏతో జతకట్టగా…మరో కీలక భాగస్వామి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. అటు అరవింద్ కేజ్రివాల్ సైతం కూటమిపట్ల సుముఖంగా లేరు.

 

ఇక అఖిలేష్ యాదవ్ సంగతి సరేసరి. ఇలా ఒక్కొక్కరూ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతుండటంతో కాంగ్రెస్దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఖచ్చితంగా తమతోనే ఉంటారని భావించిన మరో కీలక పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సైతం చేయిచ్చింది. సీట్ల సర్దుబాటు, ప్రధాని అభ్యర్థిపై ఎటూ తేల్చకపోవడం వల్లే ఒక్కొక్కరూ పార్టీ వీడుతున్నట్లు సమాచారం. అయితే ఫారూక్ సైతం ఎన్డీఏలో చేరడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. తర్వలోనే ఆయన ఎన్డీఏలో చేరే అవకాశాలను కొట్టిపారేయలేం.రానున్న లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతోపాటు 400 సీట్లపై కన్నేసిన కమలం పార్టీ..అందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. పాతమిత్రులకు మరోసారి స్నేహహస్తం అందిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబును చర్చలకు ఆహ్వానించింది. నేడో రేపో తెలుగుదేశం సైతం ఎన్డీఏలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పుడు మరో పాత మిత్రుడు ఫారుక్ అబ్దుల్లాకు వలవేసింది. కశ్మీర్ స్వయంప్రతిపత్తి ఎత్తివేయడంతోపాటు..లద్దాక్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై కశ్మీర్ పార్టీలు బీజేపీపట్ల గుర్రుగా ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ సామ, దాన, భేద దండోపాయాలన్నీ ప్రయోగించి ఒక్కొక్కరినీ దారిలోకి తెచ్చుకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఫారుక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. దీని ఫలితమే ఆయన ఎన్డీఏలోకి రానున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie