Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బాక్సాఫీస్‏ను షేక్ చేసిన సినిమాలు ఇవే..

0

ముంబై, డిసెంబర్ 27, 

సినీ పరిశ్రమకు ఈ ఏడాది ప్రత్యేకమైన సంవత్సరం అని చెప్పాలి. సౌత్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్.. టాప్ డైరెక్టర్స్ మూవీస్ రిలీజ్ కాలేదు. కానీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అటు కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్ కు ఈ ఏడాది కొత్త ఊపిరినిచ్చింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ భారీగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఈ ఏడాది థ్రిల్లర్స్, కామెడీ, యాక్షన్ చిత్రాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహా రెడ్డి సినిమాల నుంచి ఇటీవల బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయిన యానిమల్ వరకు ఏఏ సినిమాలు ఎంత కలెక్షన్స్ రాబట్టాయో తెలుసా ?.. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
2023లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు.

1. జవాన్ (₹1,148.32 కోట్లు)
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చాలా కాలం తర్వాత బాద్ షా షారుఖ్ ఖాన్ ఖాతాలో భారీ విజయం చేరింది. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.1148 కోట్లు రాబట్టింది.
2. పఠాన్ (₹1,050.30 కోట్లు)
జాన్ అబ్రహం, దీపికా పదుకొనే, షారూఖ్ ఖాన్ నటించిన నటించిన పఠాన్ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 2023లో రెండవ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ దాదాపు రూ.1050 కోట్లు రాబట్టింది.
3. యానిమల్ (₹800.47 కోట్లు)..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యాక్షన్-క్రైమ్ డ్రామా యానిమల్. ఇందులో రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించారు. ఈ సినిమా వీక్షకులకు కనెక్ట్ అయ్యే అద్భుతమైన నటనతో , మేకింగ్ తో మెప్పించారు. ఈ మూవీ రూ. 800 కోట్లు రాబట్టింది.
4. గదర్ 2 (₹691.08 కోట్లు)
22 సంవత్సరాల విరామం తర్వాత సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా వచ్చిన చిత్రం గదర్. 2001లో విడుదలైన ఈ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్‌గా తీసుకువచ్చిన మూవీ గదర్ 2. ఈ మూవీ మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. దాదాపు రూ.691 కోట్లు రాబట్టింది.
5. టైగర్ 3 (₹465.42 కోట్లు)
సల్మాన్ ఖాన్ , కత్రీనా కైఫ్ జంటగా నటించిన సినిమా టైగర్ 3. ఇటీవల విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం మొత్తం రూ. 465 కోట్లు రాబట్టింది.
6. లియో (₹.341.9 కోట్లు)
విజయ్ దళపతి, త్రిష జంటగా నటించిన సినిమా లియో. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ దాదాపు రూ.341 కోట్లు రాబట్టింది.
7. జైలర్ (₹. 336 కోట్లు)
సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ కాంబోలో వచ్చిన చిత్రం జైలర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ అయ్యింది. పాన్ ఇండియా లెవల్లో దాదాపు రూ.336 కోట్లు వసూలు చేసింది.
8. ఆదిపురుష్ (₹350 – 450 కోట్లు)
రామాయణం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ రూపొందించిన సినిమా ఆదిపురుష్. ప్రభాస్, కృతి సనన్ నటించిన ఈ సినిమాకు అత్యధిక విమర్శలు వచ్చాయి. కానీ వసూళ్లు మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఈ మూవీ రూ. 450 కోట్లు వసూలు చేసింది.
9. ది కేరళ స్టోరీ(₹303.97 కోట్లు)
లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన ఈ మలయాళ భాషా పొలిటికల్ థ్రిల్లర్ విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. ఇందులో హీరోయిన్ ఆదాశర్మ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. మొత్తం రూ.300 కోట్లు రాబట్టింది.
10 . రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (₹355.61 కోట్లు)
అలియా భట్, రణవీర్ సింగ్ జంటగా.. కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన సినిమా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా దాదాపు రూ.355 కోట్లు రాబట్టింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie