Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

భవ్యశ్రీమృతిలో ట్విస్టులు..

0

తిరుపతి, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్)

ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మ‌ృతిపై ట్విస్టుల ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మొదట సాధారణ ఆత్మహత్యగా భావించారు, తరువాత హత్య అని కుటుంబం ఆరోపించింది. ఆపై ఇది ప్రేమ వేధింపులతో చనిపోయిందా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి.  పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలోనూ విద్యార్థిని మృతి కేసు దర్యాప్తు చేపట్టారు. తాజాగా బావిలో భవ్యశ్రీ తల వెంట్రుకలు దొరకడంతో టెస్టుల కోసం ల్యాబ్ కు పంపించారని సమాచారం.చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, కావూరివారిపల్లె పంచాయతీ, వేణుగోపాలపురానికి చెందిన మునికృష్ణ, పద్మల చివరి కుమార్తె భవ్యశ్రీ(16) పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే భవ్యశ్రీకి గజేంద్ర, కుమార్ అనే ఇద్దరూ యువకులతో పరిచయం ఏర్పడింది.

ఆ తరువాత ఏం జరిగిందో కానీ ఈ నెల 16వ తేదీ నుంచి భవ్యశ్రీ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి చుట్టుప్రక్కల ప్రాంతం అంతా గాలించారు. కానీ ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ నెల 19న వేణుగోపాలపురం సమీపంలోని ఓ పాత బావిలో యువతి మృతిదేహం ఉన్నట్లు వినాయకుడి నిమజ్జనం చేసేందుకు వెళ్ళిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బావిలో నుంచి యువతి మృతిదేహాన్ని బయటకు తీయగా.. భవ్యశ్రీగా గుర్తించారు. శాంపుల్స్ సేకరించి వాటిని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ పంపి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. జట్టు కనిపించకపోవడంతో భవ్యశ్రీ తల శిరోముండం చేసినట్లుగా తల్లిదండ్రులు భావించారు. భవ్యశ్రీ ధరించిన లెగిన్స్ లేకపోవడం, నాలుక కొరికినట్లుగా ఆనవాళ్ళు ఉండడంతో అత్యాచారం చేసి ఆపై హత్య చేశారని ఆరోపించారు. ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ(16) మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాంమని ఎస్సై అనిల్ కుమార్ చెబుతున్నారు.

తాజాగా భవ్యశ్రీ తల వెంట్రుకలు లభించాయని వాటిని సైతం తిరుపతిలోని ఆర్ఎఫ్ఎఫ్ఎస్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా ఈ కేసులో పురోగతి ఉంటుదన్నారు పోలీసులు. మూడు, నాలుగు రోజులుగా మృతదేహం నీటిలో ఉన్న కారణంగా వెంట్రుకలు విడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్పారని పోలీసులు తెలిపారు. క్లూస్ కోసం మరోసారి చెక్ చేయగా భవ్యశ్రీ తల వెంట్రుకలు గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఇద్దరు యువకులను అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా అనే కోణంలోనూ ఆమె తల్లిదండ్రుల ఫోన్ కాల్స్ రికార్డ్ ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ వివరించారు.ప్రేమ వివాదం కారణంగానే భవ్యశ్రీ ప్రాణాలు కోల్పోయిందని, ఇద్దరు ఆమెను ప్రేమించారని స్థానికంగా వదంతులు వ్యాప్తి చెందాయి. అమ్మాయి ప్రేమలో ఉన్న మాట నిజమేనని, కానీ ఎవరో అమాయకురాలపై అత్యాచారం చేసి, హత్య చేసిన తరువాత బావిలో పడేశారని భవ్యశ్రీ పెద్దనాన్న ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భవ్యశ్రీ పెద్దనాన్న ఆరోపిస్తున్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie