Kollywood : కోలీవుడ్ హీరో శ్రీరామ్ అరెస్ట్: మాదకద్రవ్యాల కేసులో అదుపులోకి:కోలీవుడ్ నటుడు శ్రీరామ్ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ కావడంతో తమిళ సినీ పరిశ్రమలో అలజడి రేగింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన్ను చెన్నై పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్
కోలీవుడ్ నటుడు శ్రీరామ్ మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ కావడంతో తమిళ సినీ పరిశ్రమలో అలజడి రేగింది. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన్ను చెన్నై పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు నటుడు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి, రక్త నమూనాలను సేకరించారు.ఆ తర్వాత నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి సుమారు రెండు గంటల పాటు విచారణ జరిపారు.
ఈ కేసులో ఇప్పటికే అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణలో లభించిన సమాచారం ఆధారంగానే శ్రీరామ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన శ్రీకాంత్, సినిమాల్లో అవకాశాల కోసం చిన్న వయసులోనే చెన్నైకి వెళ్లారు. అక్కడ తన పేరును శ్రీరామ్‌గా మార్చుకుని, తొలుత చిన్న పాత్రలు చేశారు. ‘రోజా పూలు’ సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘ఒకరికి ఒకరు’తో మంచి గుర్తింపు తెచ్చుకుని, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల ‘హరికథ’ వెబ్ సిరీస్‌లో కూడా కనిపించారు. దర్శకుడు శంకర్, విజయ్ కాంబినేషన్లో వచ్చిన ‘స్నేహితులు’ చిత్రంలో జీవాతో కలిసి శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. శ్రీరామ్ అరెస్ట్ వార్త ప్రస్తుతం చెన్నై సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
