Donald Trump : ట్రంప్ మాట మార్చారు: ఇరాన్‌లో నాయకత్వ మార్పు కోరడం లేదన్న అమెరికా అధ్యక్షుడు:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో నాయకత్వ మార్పిడిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఆ దేశానికి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలన మార్పు గందరగోళానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ పాలన మార్పుపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో నాయకత్వ మార్పిడిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఆ దేశానికి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలన మార్పు గందరగోళానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇరాన్‌లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు సంకేతాలు ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు తన మాట మార్చారు. నెదర్లాండ్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు వెళుతున్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, ఇరాన్‌లో నాయకత్వ మార్పును కోరుకోవడం లేదన్నారు. పాలన మార్పు గందరగోళాన్ని సృష్టిస్తుందని, తాము అంత గందరగోళాన్ని చూడాలనుకోవడం లేదని ఆయన వివరించారు.
ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్‌లో పాలనాపరమైన మార్పు గురించి రాశారు. నాయకత్వ మార్పు అనే పదాన్ని వాడటం రాజకీయంగా సరైనది కాకపోవచ్చని, కానీ, ప్రస్తుత ఇరాన్ పాలన ‘ఇరాన్‌ను మళ్లీ గొప్పగా మార్చలేకపోతే’ అక్కడ నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదని ప్రశ్నించారు. అయితే, ఆయన ప్రస్తుత వ్యాఖ్యలు గతంలో చేసిన వాటికి భిన్నంగా ఉన్నాయి.
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ, ఈ ఆపరేషన్ లక్ష్యం పాలన మార్పు కాదని స్పష్టం చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.
Read also:Harish Rao : రైతు భరోసాపై రచ్చ: రేవంత్-హరీశ్‌రావుల మధ్య మాటల యుద్ధం
