DeepakTilak : లోకమాన్య తిలక్ ముని మనవడు, కేసరి పత్రిక ఎడిటర్ దీపక్ తిలక్ కన్నుమూత:లోకమాన్య బాల గంగాధర తిలక్ ముని మనవడు, మరాఠీ భాషా పత్రిక కేసరికి ట్రస్టీ ఎడిటర్ అయిన దీపక్ తిలక్ (78) ఈరోజు పుణెలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ పాత్రికేయుడు దీపక్ తిలక్ మృతి
లోకమాన్య బాల గంగాధర తిలక్ ముని మనవడు, మరాఠీ భాషా పత్రిక కేసరికి ట్రస్టీ ఎడిటర్ అయిన దీపక్ తిలక్ (78) ఈరోజు పుణెలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని తిలక్‌వాడలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. లోకమాన్య తిలక్ 1881లో స్థాపించిన కేసరి పత్రికకు దీపక్ తిలక్ ట్రస్టీ ఎడిటర్‌గా సేవలందించారు.దీపక్ తిలక్ మహారాష్ట్ర విద్యాపీఠంలో వైస్ ఛాన్సలర్‌గా కూడా పనిచేశారు. అకడమిక్, జర్నలిజం రంగాల్లో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Read also:TargetStore : అమెరికాలో భారత సంతతి మహిళ అరెస్ట్: ‘టార్గెట్’ స్టోర్‌లో చోరీ ప్రయత్నం!
