Kannada : మెటా క్షమాపణ: సీఎం సిద్ధరామయ్యకు AI అనువాద లోపంపై సారీ : మెటా సంస్థ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు క్షమాపణలు చెప్పింది. ఒక పోస్ట్‌ను కన్నడ నుండి ఆంగ్లంలోకి తప్పుగా అనువదించినందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మెటా, కన్నడ అనువాదంలో ఉన్న సమస్యను పరిష్కరించామని తెలిపింది.
AI తప్పు చేసింది: సిద్ధరామయ్యకు మెటా క్షమాపణ
మెటా సంస్థ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు క్షమాపణలు చెప్పింది. ఒక పోస్ట్‌ను కన్నడ నుండి ఆంగ్లంలోకి తప్పుగా అనువదించినందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మెటా, కన్నడ అనువాదంలో ఉన్న సమస్యను పరిష్కరించామని తెలిపింది. మెటా ప్రతినిధి మాట్లాడుతూ, ఈ అనువాద లోపం AI టూల్ మిషన్ తప్పిదం వల్ల జరిగిందని, ముఖ్యమంత్రికి క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. ఖచ్చితమైన అనువాదాన్ని అందించడానికి కృషి చేస్తామని, తమ AI సాంకేతికతను మెరుగుపరుచుకునే ప్రక్రియలో ఉన్నామని మెటా తన Facebook పోస్ట్‌లో పేర్కొంది.
ఇటీవల సీనియర్ నటి సరోజాదేవి కన్నుమూసినప్పుడు, కర్ణాటక సీఎంఓ కన్నడలో సంతాపం తెలుపుతూ ఒక పోస్ట్ చేసింది. అందులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహుభాషా తార, సీనియర్ నటి బి. సరోజాదేవి పార్థివదేహానికి కడసారి నివాళులర్పించారని పేర్కొంది. అయితే, మెటా సంస్థ దీన్ని ఆంగ్లంలో తప్పుగా అనువదించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, ఇలాంటి తప్పులు చాలా ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే మెటా కంపెనీ స్పందించి సీఎంకు క్షమాపణలు చెప్పింది.
Read also:Airport : ఎయిర్‌పోర్టుల్లో పక్షుల ఢీ: ప్రయాణికుల భద్రతకు సవాళ్లు – పరిష్కార మార్గాలు
