Harish Rao : నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టు వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం: తెలంగాణ హక్కుల రక్షణలో కాంగ్రెస్ వైఫల్యంపై విమర్శలు:కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందనే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెబుతున్నారని, దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు.
నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టు వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం
కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందనే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెబుతున్నారని, దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కుల గురించి ముఖ్యమంత్రి సహా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడూ మాట్లాడకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదంతా ఏదో రహస్య ఒప్పందంలో భాగమని హరీశ్ రావు ఆరోపించారు.
గతంలో బనకచర్ల ప్రాజెక్టు అజెండాలో ఉంటే ఉమ్మడి రాష్ట్రాల సమావేశానికి హాజరుకామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాసినప్పటికీ, ముఖ్యమంత్రి, ఇతర అధికారులు ఆ సమావేశానికి వెళ్లారని ఆయన గుర్తుచేశారు. బనకచర్ల అంశం మొదటి అజెండాగా ఉన్నప్పటికీ, ఆ సమావేశంలో పాల్గొని, కమిటీ ఏర్పాటుకు అంగీకరించారని విమర్శించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల మౌనమే లోకేశ్‌కు ధైర్యాన్ని ఇస్తోందని హరీశ్ రావు అన్నారు. బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీల మౌనం వల్లే చంద్రబాబు బనకచర్ల విషయంలో ముందుకు వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.
లోకేశ్ ప్రాజెక్టు కడతామని చెబుతుంటే, రేవంత్ రెడ్డి మాత్రం “కడితే కదా అడ్డుకునేది” అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడం కోసం గురుదక్షిణ చెల్లిస్తున్నారని, బీజేపీ ఢిల్లీలోని తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం మౌనంగా ఉందని హరీశ్ రావు మండిపడ్డారు. బనకచర్లపై లోకేశ్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Read also:Samsung : శాంసంగ్ కొత్త ఏఐ ల్యాప్‌టాప్: గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ విడుదల
