DonaldTrump : ట్రంప్‌పై ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ సంచలన వ్యాఖ్యలు:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ ఆర్థిక విషయాలపై అవగాహన లేని వ్యక్తి అని, ఇతర దేశాల ప్రయోజనాల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని ఆయన ధ్వజమెత్తారు.
ట్రంప్ ఆర్థిక నిరక్షరాస్యుడు: జెఫ్రీ సాచ్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ ఆర్థిక విషయాలపై అవగాహన లేని వ్యక్తి అని, ఇతర దేశాల ప్రయోజనాల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశం ట్రంప్‌ను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు. అమెరికాతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుండటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే దానికి అడ్డుపడుతున్నారని జెఫ్రీ సాచ్స్ ఆరోపించారు.
ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్న సమయంలో జెఫ్రీ సాచ్స్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందనే నెపంతో ట్రంప్ భారత్‌పై 50% టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారత్-అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపింది.అమెరికాతో అప్రమత్తంగా ఉండాలని భారత్‌కు ఇది ఒక సందేశమని జెఫ్రీ పేర్కొన్నారు. అమెరికా మార్కెట్‌ను వదిలిపెట్టి, రష్యా, ఆఫ్రికా, చైనా వంటి విశ్వసనీయ మిత్రులతో ఆర్థిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలని జెఫ్రీ సాచ్స్ భారత్‌కు సూచించారు.
Read also:IndependenceDay : విజయవాడలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – సీఎం చంద్రబాబు జెండా ఆవిష్కరణ
