GSTCut : వాహనాలధరలుతగ్గుదల:పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కార్లు, బైక్‌లపై జీఎస్టీని తగ్గించేందుకు సిద్ధమైంది. దీపావళికి సామాన్యులకు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామని, జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు.
దీపావళి బొనాంజా
పండగ సీజన్ వస్తున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. కార్లు, బైక్‌లపై జీఎస్టీని తగ్గించేందుకు సిద్ధమైంది. దీపావళికి సామాన్యులకు ‘డబుల్ బొనాంజా’ ఇస్తామని, జీఎస్టీ సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబుల జీఎస్టీ విధానాన్ని రెండు స్లాబులకు పరిమితం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. 5 శాతం, 18 శాతం స్లాబులను మాత్రమే ఉంచి, ప్రస్తుతం 28 శాతం స్లాబ్‌లో ఉన్న కార్లు, బైకులను 18 శాతం స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించింది. సెప్టెంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ఈ మార్పులు అమలైతే మాస్ మార్కెట్ కార్లు, బైకుల ధరలు బాగా తగ్గుతాయి. ప్రస్తుతం, ప్యాసింజర్ కార్లపై 28 శాతం జీఎస్టీతో పాటు, ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా 1 శాతం నుంచి 22 శాతం వరకు సెస్సు ఉంటుంది. దీనివల్ల మొత్తం పన్ను భారం 50 శాతం వరకు ఉంది. కొత్త విధానంలో పన్నులు తగ్గితే, వాహనాల అమ్మకాలు పెరుగుతాయని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి.
Read also:AP : ఏపీ పోలీసులకు హోం మంత్రి శుభవార్త.. త్వరలో కొత్త వాహనాలు, టెక్నాలజీ
