Gold and Silver : బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి – పసిడి ప్రియులకు షాక్:పసిడి ధరలు కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజాగా పెరిగిన ధరలతో వారికి మళ్ళీ షాక్ తగిలింది. ఈరోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,640 పెరగడంతో, కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగారం, వెండి ధరల ఆల్ టైమ్ హై – వివరాలు ఇక్కడ
పసిడి ధరలు కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజాగా పెరిగిన ధరలతో వారికి మళ్ళీ షాక్ తగిలింది. ఈరోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,640 పెరగడంతో, కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెండి కూడా అదే బాటలో పయనించి, ధరలు ఆకాశాన్నంటాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,500 పెరిగి, రూ. 96,200 వద్ద నిలిచింది. ఇక వెండి ధర కూడా పెరుగుతూ, కిలో వెండి ధరపై రూ. 1,100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 1,31,000కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇంచుమించుగా ఇవే ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అక్కడ కిలో వెండి ధర రూ. 1,21,000గా ఉంది. బంగారం, వెండి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు తటపటాయిస్తున్నారు. అయితే, రాబోయే రోజుల్లో ఈ ధరలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.
Read also:AP : ఏపీ లేడీ డాన్ నిడిగుంట అరుణ విచారణలో కొత్త విషయాలు
