BellamkondaSaiSreenivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు: పరిశ్రమలో స్వార్థమే ఎక్కువ!

Bellamkonda Sai Sreenivas's sensational comments: Selfishness is high in the industry!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు 

పరిశ్రమలో స్నేహాలన్నీ స్వార్థపూరితమే!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర పరిశ్రమలోని బంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ స్నేహాలు, సంబంధాలన్నీ స్వార్థంతో కూడుకున్నవేనని, మనవాళ్ళు అనుకోవడానికి ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టారు. తన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమ ఒక లోతైన సముద్రం లాంటిది. దాని లోతు అందులోకి దిగినవారికే అర్థమవుతుంది. ఇక్కడ స్నేహితులు ఉండొచ్చు కానీ, బయట ప్రపంచంలో ఉండేంత స్వచ్ఛమైన బంధాలు ఉండవు. మన ముందు ఒకలా మాట్లాడి, మనం పక్కకు వెళ్లగానే మరోలా ప్రవర్తిస్తుంటారు. అందుకే నేను ఎవరి గురించి గాసిప్స్ వినను, మాట్లాడను” అని స్పష్టం చేశారు.

తన వ్యక్తిత్వం గురించి వివరిస్తూ, “నేను చాలా ఓపెన్‌గా ఉంటాను. మనసులో ఏదీ దాచుకోను. ఎవరైనా నన్ను బాధపెడితే, ఆ విషయాన్ని వాళ్ల ముఖం మీదే చెప్పేస్తాను. అలాగే, నేను తప్పు చేస్తే వెంటనే ఒప్పుకుంటాను” అని తెలిపారు.

ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదన్న అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చారు. “మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. మా ‘కిష్కింధపురి’ ఆ నమ్మకాన్ని నిలబెడుతుంది. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి అద్భుతమైన కథను సిద్ధం చేశారు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు ఫోన్ చూసే తీరిక కూడా లేకుండా కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజువల్ ఎఫెక్ట్స్, సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన చెప్పారు.

Read also : Kathmandu : ఖాట్మండూ అల్లర్లు: విమాన రాకపోకలకు అంతరాయం, ఇండిగో సర్వీసులు రద్దు

 

Related posts

Leave a Comment