ఉత్తరాఖండ్‌లో ప్రకృతి బీభత్సం_భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం

himachal floods
  • డెహ్రాడూన్‌ శివార్లలో భారీ మేఘవిస్ఫోటనం, కుండపోత వర్షం
  • సహస్రధార ప్రాంతంలో కొట్టుకుపోయిన ఇళ్లు, దుకాణాలు, వాహనాలు
  • ప్రఖ్యాత టపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి చేరిన వరద నీరు

ఉత్తరాఖండ్ మరోసారి ప్రకృతి ఆగ్రహానికి గురైంది. డెహ్రాడూన్ శివార్లలో సంభవించిన భారీ మేఘవిస్ఫోటనం పెను విధ్వంసానికి దారితీసింది. సహస్రధార ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి.

సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో డెహ్రాడూన్‌లో పలు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. టపకేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. తమ్సా నది ఉప్పొంగి ఆలయ ఆవరణలోకి ప్రవేశించింది. హనుమాన్ విగ్రహం వరకు నీరు చేరినా, గర్భగుడి మాత్రం సురక్షితంగానే ఉందని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. రిషికేశ్‌లో చంద్రభాగ నది కూడా ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. నదిలో ఇరుక్కుపోయిన ముగ్గురిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. డెహ్రాడూన్-హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక వంతెన కూడా దెబ్బతిన్నది.

ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ధామి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు సురక్షిత నివాసం, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు తక్షణమే అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Read : Kishtwar Flash Floods : కిష్త్వార్ వరద బీభత్సం: ‘బాంబు పేలినట్టు శబ్దం’, ప్రాణాలతో బయటపడిన వారి కన్నీటి గాథలు

Related posts

Leave a Comment