Gold Rate : బంగారం ధరలు షాక్! పండగ సీజన్‌లో కొనేవారికి చేదువార్త: హైదరాబాద్‌లో నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?

Gold Price Today: Global Tensions and Fed Rate Cuts Push Gold to All-Time Highs; Know the Latest Rates

బంగారం ధరలు షాక్

గోల్డ్ రేట్ న్యూస్

లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలు

మీరు బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మరి ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పండగ సీజన్ మొదలైంది కాబట్టి, ప్రతి ఒక్కరూ కచ్చితంగా కొంతైనా బంగారం కొనుగోలు చేయాలని చూస్తుంటారు. భారతీయ మహిళలు పండగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో గోల్డ్ జువెల్లరీ ధరించడానికి ఆసక్తి చూపుతారు. ఇది వారి అందాన్ని మరింత పెంచుతుందని కూడా భావిస్తుంటారు. అందుకే రేట్ల గురించి తెలుసుకోవాలి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు సహా ఇతర కారణాల వల్ల గత కొంతకాలంగా పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే సామాన్యులు జడుసుకుంటున్నారు. ధరలు దాదాపు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్లోనే ట్రేడవుతున్నాయి.

ఇటీవల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో పసిడికి డిమాండ్ మరింత పెరిగింది. దీంతో గోల్డ్ రేట్లు కనివిని ఎరగని రీతిలో ఎగబాకాయి. వెండి ధర కూడా రూ. 1.50 లక్షల మార్కును ఎప్పుడో దాటేసింది.

అయితే, గత 2 రోజుల్లో లాభాల బుకింగ్ (Profit Booking) నేపథ్యంలో బంగారం ధరలు తగ్గినట్లు అనిపించినా, మరుసటి రోజే మళ్లీ పెరిగి షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో అదే విధంగా దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి.

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు (గత కొన్ని రోజులు ఆధారంగా):

  • హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ బంగారం ధర ఒక్కరోజులో రూ. 400 పెరిగి, తులం (10 గ్రాములు) రూ. 1,05,300 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 850, రూ. 300 చొప్పున తగ్గింది.
  • ఇక 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు తులానికి రూ. 440 పెరగడంతో ఇప్పుడు దీని ధర రూ. 1,14,880 కు చేరింది. ఇది గత 2 రోజుల్లో చూస్తే రూ. 930, రూ. 320 చొప్పున పతనమైంది.
  • ఇదే సమయంలో వెండి ధరలు చూస్తే బంగారానికి మించి పెరుగుతుండటం గమనార్హం. ఇక్కడ ఒక్కరోజులోనే రూ. 3 వేలు పెరగడంతో ప్రస్తుతం కేజీ రూ. 1.53 లక్షలు పలుకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు:

  • అంతర్జాతీయ మార్కెట్లో గరిష్ట స్థాయిల వద్ద హెచ్చుతగ్గులకు లోనవుతోంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇటీవల $3,800 డాలర్లకు సమీపంలోకి వెళ్లగా.. ప్రస్తుతం అది $3,763 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.
  • ఇక వెండి (సిల్వర్) రేటు అంతకంతకూ పెరుగుతూ పోతూనే ఉంది. ఇది రికార్డు స్థాయిలో $46 డాలర్ల మార్కును అధిగమించింది.
  • డాలర్ పుంజుకుంటుండటం కారణంగా.. రూపాయి భారీగా పడిపోతోంది. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 88.840 వద్ద ఉంది.

గమనిక: బంగారం, వెండి రేట్లు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. దీనికి షిప్పింగ్ కాస్ట్స్, స్థానిక పన్నులు, షాపులను బట్టి కూడా ధరలు వేర్వేరుగా ఉంటాయని గమనించాలి.

Read also : HYDRA : ఒకప్పుడు విమర్శలు ఎదుర్కొన్న హైడ్రా.. ఇప్పుడు ప్రజల ప్రశంసలు అందుకుంటోంది

Related posts

Leave a Comment