PostOffice : భారత పోస్ట్ సంచలనం: ఇక 24 గంటల్లో దేశమంతా పార్శిల్ డెలివరీ!

India Post Modernisation: Launching E-commerce and Speed Delivery Services by 2026
  • 2026 జనవరి నుంచి ఇండియా పోస్ట్ సరికొత్త సేవలు

  • దేశవ్యాప్తంగా 24 గంటల్లో పార్శిల్ డెలివరీ టార్గెట్

  • మెట్రో నగరాలు, రాజధానుల్లో 48 గంటల గ్యారెంటీ డెలివరీ

భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసులకు దీటుగా, దేశంలో ఎక్కడికైనా కేవలం 24 గంటల్లో పార్శిళ్లను చేరవేసే సరికొత్త ‘స్పీడ్ డెలివరీ’ విధానాన్ని తీసుకురానుంది.

ముఖ్య ప్రకటనలు (కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా):

  • 24 గంటల డెలివరీ: 2026 జనవరి నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి. (ప్రస్తుతం 3-5 రోజులు పడుతోంది).
  • 48 గంటల గ్యారెంటీ డెలివరీ: 2026 జనవరి నాటికి అన్ని మెట్రో నగరాలు, రాష్ట్ర రాజధానుల్లో ప్రారంభం.
  • ఈ-కామర్స్ భాగస్వామ్యం: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో కలిసి పనిచేయనుంది. 2026 మార్చి నాటికి ఈ సంస్థల వస్తువులకు ‘లాస్ట్-మైల్ డెలివరీ’ సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది.
  • అంతర్జాతీయ సేవలు: రెండు నెలల విరామం తర్వాత, అక్టోబర్ 15 నుంచి అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను తిరిగి ప్రారంభించింది.

ఇండియా పోస్ట్ బలం:

  • 1,64,999 పోస్టాఫీసులతో ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటిగా కొనసాగుతోంది.
  • ఈ నెట్‌వర్క్ కారణంగా దేశంలోని ప్రతి గ్రామానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే పోస్టాఫీసు అందుబాటులో ఉంది.
  • ఈ కొత్త సేవలతో పొదుపు, బీమా, ప్రభుత్వ పథకాలతో పాటు ఆధునిక డిజిటల్ సేవలు మారుమూల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువ కానున్నాయి.
  • Read also : RentedHouse : హైదరాబాద్‌లో దారుణం: అద్దె ఇంటి బాత్రూమ్ బల్బ్‌లో సీక్రెట్ కెమెరా!

Related posts

Leave a Comment