-
గాజాలో శాంతి నెలకొల్పింది ట్రంపేనని, ఆయనకు నోబెల్ ఇవ్వాలని వ్యాఖ్య
-
షరీఫ్ తీరుపై పాక్ మాజీ దౌత్యవేత్త హుస్సేన్ హక్కానీ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు
-
ట్రంప్‌ను పొగిడే పోటీలు పెడితే షరీఫ్‌కు స్వర్ణ పతకం గ్యారెంటీ అని ఎద్దేవా
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌పై సొంత దేశంలోనే విమర్శల జడివాన కురుస్తోంది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన అతిగా పొగడటమే ఇందుకు కారణం.
ఇటీవల ఈజిప్టులో జరిగిన ఇజ్రాయెల్-హమాస్ శాంతి ఒప్పంద సదస్సులో షెహబాజ్ షరీఫ్ ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. గాజాలో శాంతి నెలకొల్పడంలో ట్రంప్ కృషిని కొనియాడిన ఆయన, ప్రపంచ శాంతికి చేసిన సేవలకు గాను ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, గతంలో భారత్-పాకిస్థాన్ ఘర్షణను నివారించిన ఘనత కూడా ట్రంప్‌దేనని కితాబిచ్చారు.
అయితే, సందర్భం లేకుండా షరీఫ్ పదేపదే ట్రంప్‌ను పొగడటం పాకిస్థానీయులకు ఆగ్రహం తెప్పిస్తోంది. “ట్రంప్‌ను పొగిడేవారికి ఒలింపిక్స్ పెడితే, మన ప్రధాని షెహబాజ్‌కు స్వర్ణ పతకం ఖాయం” అంటూ అమెరికాలో పాకిస్థాన్ మాజీ రాయబారి హుస్సేన్ హక్కానీ చేసిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
షరీఫ్ అతి పొగడ్తలతో దేశ పరువు తీస్తున్నారని, ఆయన ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా మారి దేశాన్ని అమ్మేశారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుయ్యబడుతున్నారు. పాకిస్థాన్ చరిత్రకారుడు అమర్ అలీ జాన్ కూడా స్పందిస్తూ, షరీఫ్ చర్యలు పాకిస్థానీయులకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి, ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను అభాసుపాలు చేస్తున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
Read also : RashmikaMandanna : థమ్మ బాక్సాఫీస్ జోరు- ఆరు రోజుల్లో ₹91.70 కోట్లు! 100 కోట్ల క్లబ్‌కు ఆయుష్మాన్-రష్మిక
