AP Govt Jobs: AP Govt Job Calendar 2026: Complete Department-wise Vacancy Details

AP Govt Jobs: AP Government Job Calendar 2026

AP Govt Jobs:

అమరావతి, నవంబర్ 23:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ త్వరలో ప్రకటించబడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని శాఖల ఖాళీల వివరాలను సేకరించే పని కొనసాగుతోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిధి HRMS పోర్టల్‌లో ఈ వివరాలను నమోదు చేస్తున్నారు. కొన్ని శాఖలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఖాళీల వివరాలు నమోదు చేశాయి, మరికొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయి.

ప్రస్తుత సమాచారం ప్రకారం, రాష్ట్రంలో అన్ని శాఖలలో సుమారు 30% ఖాళీలు ఉన్నాయి. కొన్ని పోస్టులు కాంట్రాక్టు ఉద్యోగులచే భర్తీ చేయబడుతున్నాయి. మొత్తం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (DR) ఖాళీలు సుమారు 99,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇంకా 24 శాఖలు ఖాళీలను నిర్ధారించలేదు మరియు 21 శాఖల్లో వివరాలు నమోదు జరుగుతున్నాయి.

విభాగాల వారీగా ఖాళీలు

  • Revenue Department: మొత్తం 13,000 ఖాళీలు; 4,787 ఖాళీలు ధృవీకరించబడ్డాయి, అందులో DR పోస్టులు 2,552.

  • Higher Education: 7,000 ఖాళీలు; 3,000 పైగా ఖాళీలను కోర్టు కేసులు తొలగించిన తర్వాత భర్తీ చేసేందుకు చర్యలు.

  • Urban Development & Municipal Administration: 27,000 ఖాళీలలో 23,000 భర్తీ చేయడం సాద్యమని అంచనా.

  • Skill Development & Training: 4,000 పైగా ఖాళీలు; 2,600 DR పోస్టులు భర్తీకి సిద్ధం.

  • Agriculture Department: 3,000 పైగా ఖాళీలు; 2,400 DR పోస్టులు భర్తీకి సిద్ధం.

  • Panchayati Raj: సుమారు 26,000 ఖాళీలు; 3,000 పోస్టులు ఇన్-సర్వీస్ పదోన్నతుల ద్వారా భర్తీ.

  • Women & Child Welfare, Special Sections, Senior Citizens: 2,400 ఖాళీలు; 1,820 భర్తీకి సిద్ధం.

  • School Education: బోధన మరియు బోధనేతర పోస్టులు కలిపి సుమారు 30,000 ఖాళీలు.

  • Public Health & Family Welfare: సుమారు 10,000 పోస్టులు.

మిగిలిన 24 శాఖల్లో ఖాళీల వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు. అన్ని ఖాళీల లెక్కలు బయటపడగానే, రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు మళ్లీ చిగురించే అవకాశం ఉంది.

Read :Government jobs: Intelligence Bureau (IB) MTS Recruitment 2025 – 362 Vacancies, Apply Online

Related posts

Leave a Comment