Indian Army Sports Quota Recruitment 2025: హవిల్దార్ & నాయబ్ సుబేదార్ నియామకాలు – అర్హతలు, దరఖాస్తు వివరాలు

Indian Army Sports Quota Recruitment 2025:

Indian Army Sports Quota Recruitment 2025: స్పోర్ట్స్ కోటాలో ఇండియన్ ఆర్మీ హవిల్దార్ & నాయబ్ సుబేదార్ నియామకాలు – అర్హతలు, దరఖాస్తు వివరాలు

భారత సైన్యం నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశాన్ని అందించింది. స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ ఎంట్రీ కింద హవిల్దార్ (Havildar) మరియు నాయబ్ సుబేదార్ (Naib Subedar) పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వారీగా ఖాళీల సంఖ్యను త్వరలో ప్రత్యేక ప్రకటన రూపంలో వెల్లడించనున్నారు.

 అర్హతలు (Eligibility Criteria)

 క్రీడా అర్హతలు

2023 అక్టోబర్ 1 తర్వాత కింది క్రీడా విభాగాలలో పాల్గొన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు:

  • అంతర్జాతీయ పోటీలు

  • జూనియర్ / సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్

  • ఖేలో ఇండియా గేమ్స్

  • యూత్ గేమ్స్

  • ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్

అథ్లెటిక్స్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డీ, హ్యాండ్‌బాల్ తదితర విభాగాలు అర్హతలో ఉన్నాయి.

విద్యార్హత

  • కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులు కావాలి.

  • నోటిఫికేషన్‌లో పేర్కొన్న శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

వయోపరిమితి

  • 17½ నుండి 25 సంవత్సరాలు

  • 31 మార్చి 2001 నుంచి 1 ఏప్రిల్ 2008 మధ్య జన్మించి ఉండాలి

ఎంపిక విధానం (Selection Process)

ఎలాంటి రాత పరీక్ష లేకుండా కింది పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు:

  • స్పోర్ట్స్ ట్రయల్స్

  • ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT)

  • ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST)

  • స్కిల్ టెస్ట్

  • మెడికల్ ఎగ్జామినేషన్

  • సర్టిఫికేట్ వెరిఫికేషన్

దరఖాస్తు విధానం (How to Apply)

  • దరఖాస్తులు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు

  • చివరి తేదీ: 15 డిసెంబర్ 2025

దరఖాస్తు పంపవలసిన చిరునామా

Directorate of PT & Sports,
General Staff Branch, IHQ of MoD (Army),
Room No. 747, ‘A’ Wing, Sena Bhavan,
New Delhi.

Read: Digital India Jobs 2025: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Related posts

Leave a Comment