government jobs 2025:దేశవ్యాప్తంగా 14,967 KVS–NVS ఉద్యోగాలు: డిసెంబర్ 11 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు (KVS), జవహర్ నవోదయ విద్యాలయాలు (NVS)లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 ద్వారా మొత్తం 14,967 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు గడువు ఇప్పటికే ముగిసిపోయినా, అభ్యర్థుల అభ్యర్థనల నేపథ్యం లోగా గడువును డిసెంబర్ 11, 2025 వరకు పొడిగించారు.
ఇప్పటికీ దరఖాస్తు చేయని అభ్యర్థులు చివరి తేదీకి ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నిర్వహిస్తున్నది.
ఎంపిక విధానం:
-
ఆన్లైన్ రాత పరీక్ష
-
టైర్–1, టైర్–2 పరీక్షలు
-
టైపింగ్/స్టెనోగ్రఫీ/ట్రాన్స్‌లేషన్ నైపుణ్య పరీక్ష
-
ఇంటర్వ్యూ
PRT, TGT పోస్టులకు CTET అర్హత తప్పనిసరి.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం:
1,288 కేంద్రీయ విద్యాలయాలు (KVS)
653 జవహర్ నవోదయ విద్యాలయాలు (NVS) ఉన్నాయి.
ఎంపికైన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా, గ్రామీణ/పట్టణ/రెసిడెన్షియల్ స్కూళ్లలో సేవలు అందించాల్సి ఉంటుంది.
POST-WISE VACANCY DETAILS (2025)
అసిస్టెంట్ కమిషనర్: 17
ప్రిన్సిపాల్: 227 (KVS 134 + NVS 93)
వైస్ ప్రిన్సిపల్: 58 (KVS)
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs): 2,996
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs): 6,215
ప్రైమరీ టీచర్స్ (PRT): 2,684
PRT (సంగీతం): 187
స్పెషల్ ఎడ్యుకేటర్ (PRT): 494
KVS నాన్-టీచింగ్ పోస్టులు: 1,155
NVS నాన్-టీచింగ్ పోస్టులు: 787
అర్హత, వయస్సు పరిమితి, వేతన వివరాలు, పరీక్ష నమూనా వంటి పూర్తిస్థాయి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.
Read more: Railway Jobs 2025:సెంట్రల్ రైల్వేలో కల్చరల్ కోటా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
