YSRCP : ఎన్నికలకు సిద్ధం అవుతున్న వైసీపీ

ysrcp

 ఎన్నికలకు సిద్ధం అవుతున్న వైసీపీ గుంటూరు, డిసెంబర్ 14, (న్యూస్ పల్స్)  ఏపీలో పోయిన చోట వెతుక్కోవడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటోంది. ఏపీలో ప్రభుత్వాలు ఏవైనా పరిణామాలు ఎలా ఉన్నా విజయం మాత్రం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వైసీపీ. అసలు ప్రభుత్వ ఏర్పాటుపై వైసీపీ లెక్క ఏంటి..? ఎన్నికపై జగన్ వ్యూహాలు ఏంటి? ప్రభుత్వం తమదే అంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? అన్నదీ హాట్ టాపిక్‌గా మారింది.సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి పునర్వవైభవం తీసుకువచ్చే దిశగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ పర్యటించి, ఏపీలో పట్టు నిలుపుకునేందుకు పార్టీ నేతలను కార్యకర్తలను…

Read More

TTD ఉద్యోగుల డ్రెస్సుపై నేమ్ బోర్డు

BR NAIDU

TTD ఉద్యోగుల డ్రెస్సుపై నేమ్ బోర్డు తిరుమల, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) తిరుమలకు వెళ్తున్నారా.. అయితే ఈ కొత్త రూల్ గురించి తెలుసుకోండి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అన్ని చర్యలు చేపడుతున్న టీటీడీ మరో కొత్త రూల్ ప్రవేశపెట్టింది. ఈ రూల్ తో భక్తులకు మెరుగైన సేవలు అందించడమే టీటీడీ లక్ష్యంగా కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు మరో కొత్త రూల్ ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఇంతకు ఆ రూల్ ఏమిటి? అసలు ఈ రూల్ తో భక్తులకు ఏమేర మంచి చేకూరనుందో తెలుసుకుందాం. కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనార్థం దేశ విదేశాల నుండి తిరుమలకు భక్తులు వస్తుంటారు. అటువంటి భక్తులు ప్రధాన ఎదుర్కొంటున్న సమస్యలపై టీటీడీ కొత్త చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ…

Read More

Tirumala : 16 నుంచి ధనర్మాసం..ప్రభాత సేవకు బదులు తిరుప్పావై

Tirumala : 16 నుంచి ధనర్మాసం..ప్రభాత సేవకు బదులు తిరుప్పావై

 16 నుంచి ధనర్మాసం….సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై తిరుమల, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆరోజు ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయని పేర్కొంది.ధనుర్మాస ఘడియాల నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారని టీటీడీ తాజా ప్రకటనలో వెల్లడించింది.. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు. బిల్వ ప‌త్రాల‌తో స‌హ‌స్ర నామార్చ‌న చేస్తారు. శ్రీ‌విల్లి పుత్తూరు చిలుకలను ప్ర‌తి రోజూ స్వామివారికి అలంక‌రిస్తారు. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష నైవేద్యాలుగా దోశ‌, బెల్లం దోశ‌,…

Read More

AP Government Schemes : విద్యాదీవెన పథకానికి గ్రీన్ సిగ్నల్

Chandrababu Naidu

విద్యాదీవెన పథకానికి గ్రీన్ సిగ్నల్ నెల్లూరు, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) ఏపీలో రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన పథకాలను త్వరలో పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. దళితులకు రద్దు చేసిన పథకాలను పునరుద్దరించనున్నట్టు మంత్రి డోలా బాలవీరాంజనేయులు ప్రకటించారు.రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి పునరుద్దరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని, రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామాన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు.  అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో…

Read More

Nara Lokesh : రాజ్యసభ అభ్యర్థులలో లోకేష్ మార్క్…

రాజ్యసభ అభ్యర్థులలో లోకేష్ మార్క్

రాజ్యసభ అభ్యర్థులలో లోకేష్ మార్క్… కాకినాడ, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) రాష్ట్రంలోని అధికార టీడీపీలో రాజ్య‌సభ స్థానాల భ‌ర్తీ త‌రువాత లుక‌లుక‌లు నెల‌కొన్నాయి. పార్టీలోని సీనియ‌ర్ల‌కు మొండి చెయ్యి ద‌క్క‌డంపై అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ రాజ్య‌స‌భ స్థానాన్ని నిన్న‌కాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన సానా స‌తీష్‌కు క‌ట్ట‌బెట్ట‌డంపై ఆ పార్టీలో నేత‌లు గ‌రంగ‌రంగా ఉన్నారు. మ‌రోవైపు కొంత మంది నేత‌లు సానా స‌తీష్‌పై ఉన్న కేసుల‌ విషయాలను ప్ర‌స్తావిస్తున్నారువైసీపీకి చెందిన బీదా మ‌స్తాన్ రావు, మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, ఆర్‌.కృష్ణ‌య్య త‌మ రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న బ‌లాబలాల‌ను బ‌ట్టి ఈ మూడు స్థానాలు అధికార టీడీపీ కూట‌మికే వ‌స్తాయి. అందులో భాగంగానే కూట‌మిలోని…

Read More

AP Tourism : పర్యాటకానికి ఊతమిచ్చేనా

AP Tourism పర్యాటకానికి ఊతమిచ్చేనా

పర్యాటకానికి ఊతమిచ్చేనా విజయవాడ, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) AP Tourism : ఏపీ నూతన టూరిజం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త టూరిజం పాలసీని అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. సరైన ప్రోత్సాహం, నిధుల కేటాయింపుతో టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రాష్ట్రాలకు ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో టూరిజం ఒకటి. సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే టూరిజం నుంచి అధిక ఆదాయం పొందవచ్చనేదానికి కేరళ ఒక ఉదాహరణ నిలుస్తోంది. ఆ రాష్ట్ర ఆదాయంలో టూరిజంకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం టూరిజం అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాలు, బీచ్ లు, టూరిస్ట్ ప్రదేశాలకు ఏపీ కేంద్రంగా ఉంది. అయితే సరైన ప్రోత్సాహం…

Read More

Vidadala Rajani : విడుదల రజనీ అడ్డంగా బుక్కైనట్టేనా

Vidadala Rajani

విడుదల రజనీ అడ్డంగా బుక్కైనట్టేనా గుంటూరు, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన మొక్కను సార్‌ అంటూ..పొలిటికల్ స్క్రీన్‌ మీద అడుగు పెట్టిన ఆమె అనతికాలంలో..అందలమెక్కారు. మొదటిసారి ఎమ్మెల్యే అయి..గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజిని. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి, రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా..అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు. పవర్‌లో ఉన్నప్పుడే రజినిపై తీవ్రస్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక చిలుకలూరిపేటలో రజిని కరప్షన్ ఫైల్స్ బయటికి వస్తున్నాయి.చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమాని బెదిరించి మాజీ మంత్రి రజిని 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా.. రజిని పిఎలు చెరో 10 లక్షలు చొప్పున తీసుకున్నారని ఆరోపించింది. రెండు కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయల…

Read More

Google search : 2024 లో గూగుల్ టాప్ 10 సెర్చ్…

google

2024 లో గూగుల్ టాప్ 10 సెర్చ్… హైదరాబాద్, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) రోజూ గూగుల్‌లో ఏదో ఒక విషయం గురించి సెర్చ్ చేస్తూనే ఉంటాం. కేవలం మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక విషయం గురించి అందరూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. పొరపాటున మనకి ఏదైనా సందేహం వస్తే చాలు.. ఒక్క క్షణం ఆలోచించకుండా గూగుల్‌నే అడుగుతాం. కనీసం పక్కన ఎవరు ఉన్నా కూడా వారిని అడగం. ఎందుకంటే గూగుల్ అయితే అసలు తప్పు చెప్పకుండా కరెక్ట్ చెబుతాదని భావిస్తారు. అయితే గూగుల్ ప్రతీ ఏడాది ఎక్కువగా ఏ విషయాలు సెర్చ్ చేశారో విడుదల చేస్తుంది. ఈ ఏడాది మరో 26  రోజుల్లో పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో 2024లో ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో ఏ విషయాలు గురించి సెర్చ్ చేశారో.. ఆ…

Read More

CRDA : 20 పనులకు సీఆర్డీయే ఆమోదం

20 పనులకు సీఆర్డీయే ఆమోదం

20 పనులకు సీఆర్డీయే ఆమోదం విజయవాడ. డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) అమరావతి రాజధాని పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రాజధానిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్లు వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రుణం నుంచి ఈ పనులు చేపట్టనున్నారు. కూటమి సర్కార్ అమరావతి రాజధానిని తిరిగి పట్టాలెక్కిస్తుంది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కాగా…తాజాగా రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్‌ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు రూ. 11,467 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.అమరావతి అభివృద్ధికి…

Read More

Srisailam : స్ప ర్శ దర్శనం పై కీలక నిర్ణయం

స్సర్శ దర్శనం పై కీలక నిర్ణయం కర్నూలు, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లోనూ స్పర్శదర్శనం కల్పిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో ప్రకటించారు. స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీ సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ…

Read More