Kalvakuntla Kavitha : జగిత్యాలపై కవిత ఫోకస్

kalvakuntla kavitha

జగిత్యాలపై కవిత ఫోకస్ కరీంనగర్, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) గిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కారు దిగి, కాంగ్రెస్‌లో చేరారు. దీంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కవిత కసరత్తు మొదలుపెట్టారు. కాలం కలిసి వస్తే కవిత అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తోపాటు.. పదిమంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. ఉపఎన్నిక అనివార్యమనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఉపఎన్నిక వస్తే సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది.ముఖ్యంగా జగిత్యాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారు. పట్టున్న జగిత్యాలలో అధికార పార్టీని ఢీకొట్టాలంటే.. కవిత లాంటి వారే సరైన అభ్యర్థి అని పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కవిత జగిత్యాల గులాబీ…

Read More

KCR : 19న కేసీఆర్ ఎంట్రీ

kcr

19న కేసీఆర్ ఎంట్రీ హైదరాబాద్, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) భారత రాష్ట్ర సమితి  చీఫ్ కేసీఆర్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేందుకు  రెడీ అయ్యారు. ఈ నెల 19 వ తేదీన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రకార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు  పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కె.టి.రామారావు కు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అధినేత ఆదేశాల మేరకు…ఈనెల 19 వ తేదీన మధ్యాహ్నం 1 గంటనుండి హైద్రాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనున్నది.అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన  పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్థుత మరియు మాజీ… ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, కార్పోరేషన్…

Read More

Donald Trump : ట్రంప్ సుంకాలకు… మోడీ దెబ్బ…

modi trump

 ట్రంప్ సుంకాలకు… మోడీ దెబ్బ… న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) ప్రపంచ సుంకాల యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన టారిఫ్ దాడి నేపథ్యంలో, భారతదేశం తగిన ప్రతిదాడితో సరైన సమాధానం చెప్పింది. ప్రపంచ సుంకాల యుద్ధం సవాళ్లను ఎదుర్కోవడానికి, భారతదేశం, నాలుగు యూరోపియన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలు చేయబోతోంది. దీనివల్ల, భారతదేశం ఆ దేశాలతో ఎటువంటి ఆటంకం లేకుండా వాణిజ్యం నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుంది. అంటే, అమెరికా విధించిన సుంకాల ప్రభావం భారత్‌పై పరిమితంగానే ఉండనుంది.భారతదేశం – నాలుగు యూరోపియన్ దేశాలు కలిసి మాట్లాడుకుని, సుంకాల అడ్డంకులను పరిష్కరించడానికి సమర్థవంతమైన & ప్రభావంతమైన పరిష్కారాలను కనుగొంటాయి. దీనికోసం, భారతదేశం, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో EFTA డెస్క్‌ను ఏర్పాటు చేసింది. EFTA అంటే “యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌”. ఇది…

Read More

Illegal Immigrants : అమెరికా, లండన్ బాటలో భారత్…అక్రమ వలసల నియంత్రణ దిశగా అడుగులు

india britain

అమెరికా, లండన్ బాటలో భారత్ అక్రమ వలసల నియంత్రణ దిశగా అడుగులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) వీసా, పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే వారికి త్వరలో కఠినమైన శిక్షలు తప్పవు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్ర సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు ఉందని పేర్కొంటూ ఒక విదేశీ పౌరుడు భారతదేశంలోకి ప్రవేశించడాన్ని నిరోధించడం ఇదే మొదటిసారి. ఇది మాత్రమే కాదు, ఒక విదేశీయుడికి మరొక…

Read More

Bird Flu : చికెన్ ప్లేస్ లోకి మటన్…

bird flu

చికెన్ ప్లేస్ లోకి మటన్… ఏలూరు, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందట.. అలా ఉంది.. ఇప్పడు బర్డ్‌ఫ్లూ వైరస్‌ శుభకార్యాలయాలపై ఎఫెక్ట్ పడుతోంది. మహూర్తాలు బాగున్నాయని పెళ్లిలు, ఇతర శుభకార్యక్రమాలు ఎక్కువ పెట్టుకున్నారుర జనాలు. సడెన్‌గా బర్డ్‌ఫ్లూ రావడంతో దాని ఎఫెక్ట్‌ భోజనాలపై తీవ్రంగా పడిందని అంటున్నారు నిర్వాహకులు. ఇటీవల కాలంలో ప్రతీ వేడుకకు ముక్కలేకుండా ముద్దదిగదని పరిస్థితి నెలకొంది. చాలా మంది నాన్‌వెజ్‌ వంటకాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. కొందరు పెళ్లి వేడుక రోజున కేవలం వెజ్‌ వంటకాలు వడ్డిస్తున్నప్పటికీ ఆ తరువాత జరిపే వేడుకలకు, రిసెప్షన్లకు మాంసాహార వంటకాలు తప్పనిసరి చేస్తున్నారు.బర్డ్‌ ఫ్లూ పుణ్యమా అని నాన్‌వెజ్‌ వంటకాల్లో చికెన్‌ స్థానంలో మటన్‌ వచ్చి చేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌ వల్ల లక్షల్లో కోళ్లు మృత్యువాతపడడం,…

Read More

Graduate MLC : గ్రాడ్యేయేట్ ఎన్నికల ప్రచార జోరు

MLC ELECTIONS

గ్రాడ్యేయేట్ ఎన్నికల ప్రచార జోరు కాకినాడ, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధుల ప్రచార పర్వం మరింత వేగంగా సాగుతోంది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వ్యక్తిగతంగా ప్రచారం  చేస్తున్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ తరపున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల నాయకత్వంలో కూటమి ప్రజాప్రతినిధులు, ద్వితీయశ్రేణి నాయకులు ఎవరికి వారు జోరుగా ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యక్ష ఎన్నికలు ఇదే మొదటిసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉభయగోదావరి జిల్లా నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్‌ను బరిలో దింపింది కూటమి నాయకత్వం. గ్రాడ్యుయేట్‌ ఓటర్లు నమోదు నుంచి సభ్యత్వాల నమోదు వరకు ఎమ్మెల్యేలపై పూర్తి బాధ్యతలు పెట్టిన నాయకత్వం ఆ దిశగా పనిచేయకపోయిన వారికి…

Read More

RK Roja : రోజాకు బిగిస్తున్న ఉచ్చు

rk roja

రోజాకు బిగిస్తున్న ఉచ్చు తిరుపతి, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) ఆర్కే రోజా టీడీపీ హిట్ లిస్ట్ లో అగ్రభాగాన ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టీడీపీ నేతల చెవుల్లో మారుమోగిపోతున్నాయి. దీంతో రోజా విషయంలో కూటమి సర్కార్ సీరియస్ గానే ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆర్కే రోజాను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రోజా తర్వాత మంత్రిగా నాటి వైసీపీ హయాంలో బాధ్యతలను స్వీకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2024 వరకూ ఆర్కే రోజా టీడీపీముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై ఆమె చేసిన వ్యాఖ్యలతో నాడే టీడీపీ…

Read More

Vallabhaneni Vamshi : వంశీని పక్కాగా బుక్ చేస్తున్నారా ?

vallabhaneni vamshi11

వంశీని పక్కాగా బుక్ చేస్తున్నారా ?   విజయవాడ, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ నేతలు ఖండిస్తుంటే.. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. లిస్టులో మరికొందరు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. వంశీకి నోటీసులు ఇచ్చారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ ఖండించగా.. టీడీపీ నాయకులు సమర్థిస్తున్నారు.’వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్‌ ఏంటి. కక్షపూరిత రాజకీయాలు…

Read More

BRS : కారు పార్టీ ఎందుకిలా!

brs

కారు పార్టీ ఎందుకిలా హైదరాబాద్, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఉత్తర తెలంగాణ పరిధిలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి… దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం అంజిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థిని ప్రకటించి… ప్రచారాన్ని కూడా షురూ చేసింది. ఈ ఎన్నికల్లో తమదే విజయమని చెబుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి ఒక్కరిద్దరూ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ…. చివరగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావటంతో నరేందర్ రెడ్డి… ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించి… కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తానని చెబుతున్నారు.…

Read More

Kamal Hassan : తీరనున్న కమల్ కల…

kamal hassan

తీరనున్న కమల్ కల… చెన్నై, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) తమిళ సూపర్‌ స్టార్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ రాజ్యసభలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కమల్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జులైలో జరిగే రాజసభ్య ఎన్నికల్లో డీఎంకే తమ అభ్యర్థిగా కమల్‌ను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు మంత్రి పీకే సేకర్‌ బాబు కమల్‌ హాసన్‌తో ఆయన నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. రాజ్యసభ అంశం గురించే వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కమల్‌ హాసన్‌ మక్కల్‌ నిధి మయం(ఎంఎన్‌ఎం) పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగానే ఎంఎన్‌ఎంకు ఒక రాజ్యసభ…

Read More