Kumbhamela : కుంభమేళకు హెలికాఫ్టర్ సేవలు

kumbha mela

కుంభమేళకు హెలికాఫ్టర్ సేవలు లక్నో, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) మహాకుంభమేళా ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్ల సంఖ్యలో వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 42 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. అయితే.. దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే.. వంద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. దాదాపు 300 కిలో మీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అవ్వడంతో.. చాలా మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భక్తులకు పోలీసులు సూచినలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంత భారీ ఎత్తున్న భక్తులు కుంభమేళా కోసం వెళ్తున్నారు.చాలా మంది మార్గమధ్యలోనే ట్రాఫిక్‌లో గంటల…

Read More

Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీ అరెస్ట్.

Vallabhaneni Vamshi

వల్లభనేని వంశీ అరెస్ట్. విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు.. కిడ్నాప్‌, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కూడా పెట్టారు. అటు వంశీ ఇంటికి నోటీసులు అంటించారు.  ఇదిలా ఉంటే.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొద్దిరోజుల కిందట ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది.గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌.. కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్థన్‌ హఠాత్తుగా పిటిషన్‌ విత్‌డ్రా చేసుకోవడం ఇప్పటికే సంచలనమైంది. ఈ కేసులో ఇవాళ…

Read More

Pawan Kalyan : ఆలయాల సందర్శన వెనుక….

pawan kalyan_temples visit

ఆలయాల సందర్శన వెనుక…. తిరువనంతపురం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన కేరళ చేరుకున్నారు. మూడు రోజులపాటు కేరళ తో పాటు కర్ణాటకలో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు పవన్. ఆయన వెంట కుమారుడు అకిరా నందన్ కూడా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి విమానాశ్రయంలో దిగారు. అక్కడ నుంచి నేరుగా అగస్త్య మహర్షి ఆలయం, ఆశ్రమాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు పవన్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన ఉంటుంది. అయితే పవన్ ఆలయ సందర్శన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడిచింది. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తోనే ఆయన ఈ…

Read More

Bird Flue : రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్…కిలో మీట‌ర్ ప‌రిధిలో రెడ్ జోన్‌….

bird flue

రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్… కిలో మీట‌ర్ ప‌రిధిలో రెడ్ జోన్‌… ఏలూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)’ రాష్ట్రంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మ‌ర‌ణాలు సంభ‌విస్తోన్నాయి. తొలుత నాటుకోళ్లు, ఆ త‌రువాత పందెం కోళ్ల‌కు వ్యాపించిన ఈ వైర‌స్‌… చివ‌రికి కోళ్ల ఫామ్‌లనే చుట్టేసి విల‌య‌తాండ‌వం చేస్తోంది.ఉభ‌యగోదావ‌రి జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 30 ల‌క్షల కోళ్లు మృతి చెందాయి. దీంతో ప్ర‌త్యేక బృందాలు రంగంలోకి దిగి ఈనెల 6, 7 తేదీల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేక‌రించాయి. వాటిని విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర ప‌శువ్యాది నిర్ధార‌ణ‌తో పాటు భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమ‌ల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కి పంపాయి. దీంతో కొన్ని శాంపిల్స్ లో బ‌ర్డ్‌ఫ్లూ పాజిటివ్ వ‌చ్చింది. ఆ శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాల‌ను గుర్తించి… అక్క‌డ…

Read More

 Pawan Kalyan : ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం…

pawan kalyan

ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం… విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరవై మూడో తేదీన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.  ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని పవన్ సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్.. అనారోగ్యంతో ఇటీవలి కాలంలో అధికార కార్యక్రమాల్లో లేరు. ఆయన నాలుగు రోజుల పాటు పుణ్యక్షేత్రాల పర్యటనకు కేరళ, తమిళనాడు వెళ్లారు. అక్కడి పర్యటన పూర్తయిన తర్వాత స్పాండిలైటిస్ కు కేరళ వైద్యం తీసుకునే అవకాశం  ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అక్కడి వైద్యం గురించి ఆరా తీశారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పంథా…

Read More

Work From Home Policy for Women in AP : మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్…

work from home for women

మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్… జీసీసీ పాలసీ 4.0 కోసం కసరత్తు కాకినాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌ను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి నుంచి పని చేయడం సౌలభ్యంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుందని ట్విట్టర్ వేదికగా సీఎం వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. సైన్స్ రంగంలో విజయం సాధిస్తున్న మహిళలను…

Read More

Vidadhala Rajani : విడదల రజనీ ఫ్రస్టేషన్ పీక్స్…

vidadala rajani

విడదల రజనీ ఫ్రస్టేషన్ పీక్స్… గుంటూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) మాజీ మంత్రి విడదల రజినీ విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ పరుష పదజాలం వాడని ఆమె ఇటీవల సవాళ్లు విసురుతూ.. తన రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుని టార్గెట్ చేస్తుండటం అభద్రతాభావంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ హయాంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఓటమి తర్వాత పార్టీ మారడానికి ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యపడక పోవడంతో ఇప్పుడు కేసుల భయంతో సవాళ్ల పర్వానికి తెర లేపుతున్నారంటున్నారు. అసలు ఆమెలోని కొత్త కోణంపై జరుగుతున్న చర్చేంటి.తనపై కేసు నమోదు అవ్వగానే మాజీ మంత్రి విడదల రజినీ వాయిస్ సడన్‌గా మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా తెగ ఆవేశపడిపోతున్నారామె.. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట…

Read More

Pawan Kalyan : చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయని పవన్ కల్యాణ్?

pawan kalyan

చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయని పవన్ కల్యాణ్? విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ కు కూడా దూరంగా ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మూడు రోజుల పర్యటనకు వెళ్లడమూ రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే పవన్ కల్యాణ్ గత కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. అయితే ఆయనకు జ్వరంతో పాటు తీవ్రమైన నడుంనొప్పి ఉందని, వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.స్పాండిలైటిస్ తో బాధపడుతూ, జ్వరం బారిన పడిన పవన్ కల్యాణ్ కొద్దిగా తేరుకున్న…

Read More

AP Tourism : టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ

AP_Tourism

టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ విశాఖపట్టణం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులను త్వరితగతిన వేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు శరవేగంగా రావడానికి అవసరమైన ప్రతిపాదనలకు ఓకే చెప్పనుంది. దీంతో ఏపీలోని పలు టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఆంధ్రప్రదేశ్ స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయనున్న నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అభ్యర్థనకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. మరో వారం, పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రాజెక్టులకు…

Read More

GHMC : గ్రేటర్ లో బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్

ghmc

గ్రేటర్ లో బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్ హైదరాబాద్, ఫిబ్రవరి 12, (న్యూస పల్స్) గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు, మరోవైపు అవిశ్వాస తీర్మానం వ్యవహారంతో రాజకీయపార్టీల వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి విజయ సాధించి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతలపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలు తమ కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేస్తు్న్నాయి.బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఇటీవల కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవిశ్వాసంపై ఎలా ముందుకు వెళ్లాలనే…

Read More