ఆలయాల సందర్శన వెనుక…. తిరువనంతపురం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన కేరళ చేరుకున్నారు. మూడు రోజులపాటు కేరళ తో పాటు కర్ణాటకలో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు పవన్. ఆయన వెంట కుమారుడు అకిరా నందన్ కూడా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి విమానాశ్రయంలో దిగారు. అక్కడ నుంచి నేరుగా అగస్త్య మహర్షి ఆలయం, ఆశ్రమాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు పవన్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన ఉంటుంది. అయితే పవన్ ఆలయ సందర్శన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడిచింది. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తోనే ఆయన ఈ…
Read MoreAuthor: Admin
Bird Flue : రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్…కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్….
రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్… కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్… ఏలూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)’ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవిస్తోన్నాయి. తొలుత నాటుకోళ్లు, ఆ తరువాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్… చివరికి కోళ్ల ఫామ్‌లనే చుట్టేసి విలయతాండవం చేస్తోంది.ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల కోళ్లు మృతి చెందాయి. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈనెల 6, 7 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించాయి. వాటిని విజయవాడలోని రాష్ట్ర పశువ్యాది నిర్ధారణతో పాటు భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కి పంపాయి. దీంతో కొన్ని శాంపిల్స్ లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఆ శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాలను గుర్తించి… అక్కడ…
Read MorePawan Kalyan : ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం…
ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం… విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరవై మూడో తేదీన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని పవన్ సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్.. అనారోగ్యంతో ఇటీవలి కాలంలో అధికార కార్యక్రమాల్లో లేరు. ఆయన నాలుగు రోజుల పాటు పుణ్యక్షేత్రాల పర్యటనకు కేరళ, తమిళనాడు వెళ్లారు. అక్కడి పర్యటన పూర్తయిన తర్వాత స్పాండిలైటిస్ కు కేరళ వైద్యం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అక్కడి వైద్యం గురించి ఆరా తీశారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పంథా…
Read MoreWork From Home Policy for Women in AP : మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్…
మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్… జీసీసీ పాలసీ 4.0 కోసం కసరత్తు కాకినాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌ను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి నుంచి పని చేయడం సౌలభ్యంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుందని ట్విట్టర్ వేదికగా సీఎం వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. సైన్స్ రంగంలో విజయం సాధిస్తున్న మహిళలను…
Read MoreVidadhala Rajani : విడదల రజనీ ఫ్రస్టేషన్ పీక్స్…
విడదల రజనీ ఫ్రస్టేషన్ పీక్స్… గుంటూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) మాజీ మంత్రి విడదల రజినీ విపరీతమైన ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. జగన్ కేబినెట్‌లో మినిస్టర్‌గా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ పరుష పదజాలం వాడని ఆమె ఇటీవల సవాళ్లు విసురుతూ.. తన రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుని టార్గెట్ చేస్తుండటం అభద్రతాభావంతోనే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ హయాంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె ఓటమి తర్వాత పార్టీ మారడానికి ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యపడక పోవడంతో ఇప్పుడు కేసుల భయంతో సవాళ్ల పర్వానికి తెర లేపుతున్నారంటున్నారు. అసలు ఆమెలోని కొత్త కోణంపై జరుగుతున్న చర్చేంటి.తనపై కేసు నమోదు అవ్వగానే మాజీ మంత్రి విడదల రజినీ వాయిస్ సడన్‌గా మారిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా తెగ ఆవేశపడిపోతున్నారామె.. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట…
Read MorePawan Kalyan : చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయని పవన్ కల్యాణ్?
చంద్రబాబు ఫోన్ లిఫ్ట్ చేయని పవన్ కల్యాణ్? విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ కు కూడా దూరంగా ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారత దేశంలోని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు మూడు రోజుల పర్యటనకు వెళ్లడమూ రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే పవన్ కల్యాణ్ గత కొద్ది రోజుల నుంచి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. అయితే ఆయనకు జ్వరంతో పాటు తీవ్రమైన నడుంనొప్పి ఉందని, వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.స్పాండిలైటిస్ తో బాధపడుతూ, జ్వరం బారిన పడిన పవన్ కల్యాణ్ కొద్దిగా తేరుకున్న…
Read MoreAP Tourism : టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ
టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ విశాఖపట్టణం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా టూరిజం ప్రాజెక్టులను త్వరితగతిన వేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు శరవేగంగా రావడానికి అవసరమైన ప్రతిపాదనలకు ఓకే చెప్పనుంది. దీంతో ఏపీలోని పలు టూరిజం ప్రాజెక్టులకు మహర్దశ పట్టనుంది. ఆంధ్రప్రదేశ్ స్వదేశీ దర్శన్ క్రింద అభివృద్ధి చేయనున్న నాగార్జున సాగర్, అహోబిలం, సూర్యలంక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ అభ్యర్థనకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారు. మరో వారం, పది రోజుల్లో సంబంధిత ప్రక్రియ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రాజెక్టులకు…
Read MoreGHMC : గ్రేటర్ లో బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్
గ్రేటర్ లో బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్ హైదరాబాద్, ఫిబ్రవరి 12, (న్యూస పల్స్) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పాలకమండలి పదవికాలం నాలుగేళ్లు పూర్తయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం తెరమీదకు వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు, మరోవైపు అవిశ్వాస తీర్మానం వ్యవహారంతో రాజకీయపార్టీల వ్యవహారం కొత్త చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి విజయ సాధించి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతలపై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ రెండు పార్టీలు తమ కార్పొరేటర్లకు దిశా నిర్ధేశం చేస్తు్న్నాయి.బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవిశ్వాసంపై ఎలా ముందుకు వెళ్లాలనే…
Read MoreMinister Seetakka : చిన్నారులతో కలిసి డిన్నర్ చేసిన మంత్రి సీతక్క
చిన్నారులతో కలిసి డిన్నర్ చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్ సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సుకోసం వినియోగించాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవ భావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. చిన్ననాటి ఉంటే పిల్లల్లో పెద్దలపట్ల సమాజం పట్ల ఎలా నడుచుకోవాలి నేర్పించాలని హితవు పలికారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఏఎస్ఎఫ్ బిబిక్యూ & గ్రిల్ రెస్టారెంట్ లో ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో చిన్నారులతో పాటు మంత్రి పాలుపంచుకొని వారిలో ఆనందాన్ని నింపారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం…
Read MoreCongress : ఢిల్లీ కాంగ్రెస్ కు ఏమైంది…
ఢిల్లీ కాంగ్రెస్ కు ఏమైంది… న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఎటొచ్చి ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు. అయితే ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమో అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆశపడ్డాయి. కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశ తప్పలేదు.పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,…
Read More