Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

“దిశ” యాప్ తో మహిళలకు సంపూర్ణ రక్షణ  ఆలమూరు ఎస్సై శివప్రసాద్.

0

దిశ యాప్ తో మహిళలకు పూర్తి భద్రత ఉంటుందని ఆలమూరు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల పరిధి కొత్తూరు సెంటర్, ఆలమూరు పోలీస్ స్టేషన్, మడికి జాతీయ రహదారి వద్ద మహిళా పోలీసులతో మూడు బృందాలుగా ఏర్పాటు చేసి దిశ యాప్ వలన మహిళలకు వచ్చే ఉపయోగాలను అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్లు ద్వారా దిశ యాప్ వాడటం వలన మహిళలకు సంపూర్ణ రక్షణ ఉంటుందని, ఆపత్కాలంలో ఈ యాప్ ను ఉపయోగిస్తే క్షణాల్లో వారు ఏ ప్రాంతంలో ఉన్న రక్షిస్తామని అన్నారు.

 

మహిళలకు రక్షణ కల్పించేందుకు ఆలమూరు మండలంలో మహిళా పోలీసులతో ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని వారు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తున్నారని, వారి సేవలను మహిళలు, విద్యార్థీనులు, చిన్నారులు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. అలాగే మహిళల సెల్ ఫోన్లలో దిశ యాప్ లేనివారికి వెంటనే దిశ యాప్ ను అప్లోడ్ చేసి దాని యొక్క ఉపయోగాలను వివరించారు.

చేపల వేటకు మత్స్యకారులు సిద్దం.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie