Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

సిద్దిపేటలో ఐటీ హబ్‌.. ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు.

0

సిద్దిపేటలో మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ పర్యటిచారు.  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగులబండలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉపయోగపడుతుందని తెలిపారు. పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి అందుతుందని అన్నారు. 15 అంతర్జాతీయ కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయని వెల్లడించారు.

 

ఇంతకు ముందు పట్టణ శివారు ఇర్కోడులో రూ.6కోట్లతో నూతనంగా నిర్మించిన ఆధునిక కబేళా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్ వెజ్ ఆకుకూరలు, పంచాయతీరాజ్ శాఖ సేంద్రీయ ఎరువుల స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో బిటి, సిసి రోడ్లు, నర్సాపూర్ కప్పలకుంటలో సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సాపూర్‌లో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశారు. స్వచ్ఛ బడిని సందర్శించారు. మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ () సిద్దిపేటలోపర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభిస్తున్నారు.

అధ్యక్షా.. ఎందుకీ మౌనం..

పట్టణ శివారు ఇర్కోడ్‌లో రూ.6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్‌ స్లాటర్‌ హౌస్‌ను, అందులో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్‌ నాన్‌వెజ్‌ పచ్చళ్లు, పంచాయతీరాజ్‌ శాఖ సేంద్రియ ఎరువుల స్టాళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జే పాటిల్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, తదితతలు పాల్గొన్నారు.అనంతరం సిద్దిపేట పట్టణంలో బీటీ, సీసీ రోడ్లకు, నర్సాపూర్‌ వద్ద గల కప్పలకుంట సుందరీకరణ పనులకు శకుస్థాపన చేశారు. ఆ తర్వాత నర్సాపూర్‌లో తాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. స్వచ్ఛ బడిని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నాగులబండ వద్ద నిర్మించిన ఐటీ టవర్‌ను ప్రారంభించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie