మలయాళ స్టార్ హీరోల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు భూటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసులో కొనసాగుతున్న సోదాలు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో తనిఖీలు భుటాన్ లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కుంభకోణం కేసు మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ప్రముఖ నటులు మమ్ముట్టి, ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చక్కలక్కల్ నివాసాలతో పాటు మొత్తం 17 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దాడులు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ ఈ చర్యలు చేపట్టింది. భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా టయోటా ల్యాండ్ క్రూయిజర్, ల్యాండ్…
Read More