ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో భారత యువతిపై జాతి వివక్ష దాడి ‘మీ దేశానికి తిరిగి వెళ్లిపో’ అంటూ దూషణలకు దిగిన గుర్తుతెలియని మహిళ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో నివసిస్తున్న భారతీయ యువతి స్వాతి వర్మకు ఒక భయంకరమైన జాత్యాహంకార అనుభవం ఎదురైంది. అక్టోబర్ 8న జిమ్ నుంచి ఇంటికి నడిచి వెళ్తున్న ఆమెను అడ్డగించిన గుర్తు తెలియని మహిళ, తీవ్రమైన జాత్యాహంకార దూషణలకు పాల్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏం జరిగింది: తన ఇంటికి సమీపంలో ఉన్న స్వాతి వర్మను డబ్లిన్ సిటీ యూనివర్సిటీ (డీసీయూ) బ్యాడ్జ్ ధరించిన ఒక మహిళ సమీపించింది. దారి అడుగుతుందేమోనని స్వాతి భావించారు, కానీ ఆ మహిళ అనూహ్యంగా “నువ్వు ఐర్లాండ్‌కు ఎందుకొచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ దేశానికి తిరిగి…
Read More