Antarvedi : అంతర్వేది వద్ద అర కిలోమీటరు మేర వెనక్కి తగ్గిన సముద్రం – ఒండ్రు మట్టి పేరుకుపోవడంతో ప్రజల్లో సునామీ భయం

Konaseema District: Bay of Bengal Recedes by 500 Meters at Antarvedi – Unusual Silt Deposit Sparks Tsunami Fears Among Locals

కోనసీమ జిల్లా అంతర్వేదిలో సముద్రం వెనక్కి! ఏకంగా 500 మీటర్ల మేర అంతర్ముఖం మోకాళ్ల లోతులో పేరుకుపోయిన ఒండ్రు మట్టి కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగాళాఖాతం ఏకంగా 500 మీటర్ల (అర కిలోమీటర్) మేర వెనక్కి తగ్గడం తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంతో స్థానిక ప్రజలు, మత్స్యకారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సముద్రం వెనక్కి వెళ్లిన ప్రాంతమంతా ఇప్పుడు సాధారణంగా ఉండే ఇసుకకు బదులుగా మోకాళ్ల లోతులో చిక్కటి ఒండ్రు మట్టితో నిండిపోయింది. ఇలా ఒండ్రు పేరుకుపోవడం మునుపెన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు, ఇది వారి భయాన్ని మరింత పెంచుతోంది. చాలా మంది పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించే ముందు ఇలాగే సముద్రం వెనక్కి వెళుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా అంతర్వేది…

Read More