ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఈ నెల 18 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం అక్రమంగా తరలించే టపాసులతోనే ఎక్కువ నష్టమని వ్యాఖ్య దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణానికి మేలు చేసే ‘గ్రీన్ క్రాకర్స్’ను పరిమితంగా కాల్చుకునేందుకు అనుమతినిస్తూ, ఈ నెల 18 నుంచి 21 వరకు (నాలుగు రోజుల పాటు) వెసులుబాటు కల్పించింది. అయితే, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోకి బయటి నుంచి టపాసులను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. “బయటి ప్రాంతాల నుంచి అక్రమంగా తరలించే టపాసుల వల్లే పర్యావరణానికి ఎక్కువ నష్టం జరుగుతోంది. మనం పర్యావరణంతో రాజీ పడకుండా, సంయమనం పాటిస్తూ సమతుల్య విధానాన్ని అనుసరించాలి” అని…
Read MoreTag: #సుప్రీంకోర్టు
Telangana : తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు
Telangana : తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు:తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు: స్పీకర్‌కు 3 నెలల గడువు తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సీజే బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలను నేరుగా న్యాయస్థానమే అనర్హులుగా ప్రకటించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్’ అన్న సూత్రం వర్తించకూడదని సర్వోన్నత న్యాయస్థానం…
Read More