CJI : భారత 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ పేరు సిఫారసు

Justice Surya Kant Recommended as India's 53rd CJI; Tenure to Last 14 Months

నవంబర్ 23న జస్టిస్ గవాయ్ పదవీ విరమణ నవంబర్ 24న 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు 14 నెలల పాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పేరు ఖరారైంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్.. తన వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సోమవారం (అక్టోబర్ 27, 2025) సిఫారసు చేశారు. దీంతో దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకానికి మార్గం సుగమమైంది. జస్టిస్ గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సూచించాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కోరిన మీదట జస్టిస్ గవాయ్ ఈ సిఫారసు చేశారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న…

Read More