11 ఏళ్లలో 11 కోట్ల నుంచి 25 కోట్లకు పెరిగిన విమాన ప్రయాణికులు దేశవ్యాప్తంగా ‘యాత్రి సేవా దివస్ 2025’ను ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు విమానయానం ఉన్నత వర్గాల నుంచి సామాన్యులకు చేరిందని వెల్లడి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో దేశ విమానయాన రంగం అద్భుతంగా వృద్ధి చెందిందని తెలిపారు. 2014లో 11 కోట్లుగా ఉన్న విమాన ప్రయాణికుల సంఖ్య 2025 నాటికి 25 కోట్లకు పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిందని, ఆయన ప్రజలకు ‘ప్రధాన సేవకుడిగా’ సేవలందించారని పేర్కొన్నారు. యూపీలోని హిండన్ విమానాశ్రయంలో జరిగిన ‘యాత్రి సేవా దివస్ 2025’ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.…
Read More