ఆస్ట్రేలియాలో భారతీయులపై సెనెటర్ జసింటా ప్రిన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు జీవన వ్యయం పెరగడానికి భారత వలసదారులే కారణమంటూ ఆరోపణ వ్యాఖ్యలను ఖండించిన సొంత పార్టీ నేతలు భారత సంతతి ప్రజల ఆగ్రహం ఆస్ట్రేలియాలో భారత సంతతికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సెనెటర్ పై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ తీవ్రంగా స్పందించారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భారత సమాజానికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ఆస్ట్రేలియా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సెంటర్ రైట్ లిబరల్ పార్టీకి చెందిన సెనెటర్ జసింటా ప్రిన్స్, ఆస్ట్రేలియాలో జీవన వ్యయం, ఇతర సమస్యలకు భారత వలసదారులే కారణమని ఆరోపించారు. అధికార లేబర్ పార్టీ ఓట్ల కోసం భారీ సంఖ్యలో భారతీయులను ఆస్ట్రేలియాలోకి రప్పిస్తుందని విమర్శించారు. లేబర్ పార్టీకి వచ్చిన ఓట్లను, భారతీయుల వలసల సంఖ్యను పోల్చి…
Read More