టైటిల్ పోరుకు బీసీసీఐ సభ్యులు గైర్హాజరయ్యే అవకాశం మహిళల ప్రీమియర్ లీగ్ కమిటీ ఏర్పాటుపై ప్రత్యేక చర్చ ఆర్థిక నివేదికలు, ఆడిటర్ల నియామకం వంటి అంశాలపై నిర్ణయాలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 94వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సెప్టెంబర్ 28న ముంబైలోని దాని ప్రధాన కార్యాలయంలో జరగనుంది. ఈ కీలక సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడుతో పాటు ఇతర కీలక పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే, అదే రోజున యూఏఈ వేదికగా ఆసియా కప్ ఫైనల్ కూడా జరగడం గమనార్హం. దీంతో, ఏ ఒక్క బీసీసీఐ ఆఫీస్ బేరర్ కూడా ఈ టైటిల్ పోరుకు హాజరు కాలేరు. బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా విడుదల చేసిన నోటీసు ప్రకారం, ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన అంశాలు ఎజెండాగా ఉన్నాయి. కొత్త…
Read More