బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు పరిశ్రమలో స్నేహాలన్నీ స్వార్థపూరితమే! టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్ర పరిశ్రమలోని బంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ స్నేహాలు, సంబంధాలన్నీ స్వార్థంతో కూడుకున్నవేనని, మనవాళ్ళు అనుకోవడానికి ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టారు. తన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ, “సినిమా పరిశ్రమ ఒక లోతైన సముద్రం లాంటిది. దాని లోతు అందులోకి దిగినవారికే అర్థమవుతుంది. ఇక్కడ స్నేహితులు ఉండొచ్చు కానీ, బయట ప్రపంచంలో ఉండేంత స్వచ్ఛమైన బంధాలు ఉండవు. మన ముందు ఒకలా మాట్లాడి, మనం పక్కకు వెళ్లగానే మరోలా ప్రవర్తిస్తుంటారు. అందుకే నేను ఎవరి గురించి గాసిప్స్ వినను,…
Read More