ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ ఒప్పందం ఇకపై ఆన్లైన్లో రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ బైకుల విక్రయం సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న అమ్మకాలు రాయల్ ఎన్ఫీల్డ్, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ, తొలిసారిగా ఆన్లైన్ అమ్మకాలను ప్రారంభించింది. దీని కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో రాయల్ ఎన్ఫీల్డ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 22న ఫ్లిప్‌కార్ట్ నిర్వహించే బిగ్ బిలియన్ డేస్ సేల్‌తో మొదలవుతుంది. ఈ భాగస్వామ్యం ద్వారా, వినియోగదారులు బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోన్ క్లాసిక్ 350, మీటియోర్ 350 వంటి రాయల్ ఎన్ఫీల్డ్ 350 సీసీ మోడళ్లను నేరుగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మొదటి దశలో ఈ సేవలు బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లక్నో, ముంబై నగరాల్లో అందుబాటులో ఉంటాయి.…
Read More