Bird Flue : రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్…కిలో మీట‌ర్ ప‌రిధిలో రెడ్ జోన్‌….

bird flue

రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్… కిలో మీట‌ర్ ప‌రిధిలో రెడ్ జోన్‌… ఏలూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)’ రాష్ట్రంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మ‌ర‌ణాలు సంభ‌విస్తోన్నాయి. తొలుత నాటుకోళ్లు, ఆ త‌రువాత పందెం కోళ్ల‌కు వ్యాపించిన ఈ వైర‌స్‌… చివ‌రికి కోళ్ల ఫామ్‌లనే చుట్టేసి విల‌య‌తాండ‌వం చేస్తోంది.ఉభ‌యగోదావ‌రి జిల్లాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 30 ల‌క్షల కోళ్లు మృతి చెందాయి. దీంతో ప్ర‌త్యేక బృందాలు రంగంలోకి దిగి ఈనెల 6, 7 తేదీల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేక‌రించాయి. వాటిని విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర ప‌శువ్యాది నిర్ధార‌ణ‌తో పాటు భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమ‌ల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కి పంపాయి. దీంతో కొన్ని శాంపిల్స్ లో బ‌ర్డ్‌ఫ్లూ పాజిటివ్ వ‌చ్చింది. ఆ శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాల‌ను గుర్తించి… అక్క‌డ…

Read More