కాంగ్రెస్ తీరుపై సోషల్ మీడియాలో బీజేపీ నేతల విమర్శలు పాక్ అనుమతి కోసమే కాంగ్రెస్ ఎదురుచూస్తోందన్న అమిత్ మాలవీయ కాంగ్రెస్ పాకిస్థాన్‌కు బీ-టీమ్ అని ఆరోపించిన మరో నేత ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో, రాజకీయంగా మాటల యుద్ధం మొదలైంది. టీమిండియాను అభినందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందంటూ బీజేపీ సోమవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. భారత విజయాన్ని అభినందించడానికి కాంగ్రెస్ పార్టీ “పాకిస్థాన్ అనుమతి” కోసం ఎదురుచూస్తోందని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అయిన అమిత్ మాలవీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో స్పందిస్తూ, “ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన అద్భుత విజయం రాహుల్ గాంధీని, మొత్తం కాంగ్రెస్ పార్టీని నిశ్శబ్దంలోకి నెట్టినట్లుంది” అని వ్యాఖ్యానించారు. గతంలో…
Read More