కంటి చూపును దెబ్బతీసే ఫంగల్ కెరటైటిస్‌కు కొత్త చికిత్స కోల్‌కతా బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల ఆవిష్కరణ హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యం SA-XV అనే కొత్త పెప్టైడ్తో ఫంగస్‌ను నాశనం చేసే థెరపీ Eye Infection : కంటి చూపును తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైన ఫంగల్ కెరటైటిస్ చికిత్సలో భారతీయ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. కోల్‌కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు, హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (LVPEI) నిపుణుల సహకారంతో, ఫంగస్‌ను సమర్థవంతంగా నాశనం చేసే ఒక కొత్త పెప్టైడ్ ఆధారిత థెరపీని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు SA-XV అనే 15 అమైనో ఆమ్లాలతో కూడిన ప్రత్యేక పెప్టైడ్‌ను రూపొందించారు. ఇది ఫంగస్ పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా, ప్రస్తుతం వాడుతున్న మందులతో పోలిస్తే దుష్ప్రభావాలు చాలా తక్కువగా…
Read More