Kavitha : బీఆర్ఎస్ సస్పెన్షన్ తర్వాత కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయాలు: తెలంగాణ జాగృతి పునరుత్తేజం

Kavitha's Comeback: Reinvigorating 'Telangana Jagruthi' After BRS Suspension

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎస్టీ నేత లకావత్ రూప్ సింగ్‌కు బాధ్యతలు నియామకాల్లో సామాజిక న్యాయానికి పెద్దపీట అని కవిత వెల్లడి త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నట్లు ప్రకటన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి సస్పెండైన కొద్ది వారాల్లోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆమె స్థాపించిన సాంస్కృతిక సంస్థ తెలంగాణ జాగృతిని పునరుద్ధరించే దిశగా ఆమె కీలక అడుగులు వేశారు. పవిత్రమైన దసరా పండుగ సందర్భంగా సంస్థ రాష్ట్ర కమిటీకి కొత్త సభ్యులను నియమించినట్లు కవిత ప్రకటించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట ఈ నూతన నియామకాల్లో సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని కవిత స్పష్టం చేశారు. కొత్తగా ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలోని 80 శాతానికి పైగా పదవులను బడుగు, బలహీన వర్గాల వారికి కేటాయించినట్లు…

Read More