ఒక్కరోజే కిలో వెండిపై రూ. 13,000 తగ్గుదల తులం బంగారంపై రూ. 1900 వరకు పడిపోయిన రేటు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ ప్రకటన ప్రభావం కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలకు శనివారం బులియన్ మార్కెట్లో ఒక్కసారిగా బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్ చరిత్రలో ఇటీవల కాలంలో చూడనంత భారీ పతనంతో పసిడి, వెండి రేట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా వెండి ధర అనూహ్యంగా కిలోపై ఏకంగా రూ. 13,000 తగ్గడం కొనుగోలుదారులను, మదుపరులను ఆశ్చర్యానికి గురిచేసింది. రికార్డులు సృష్టిస్తూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన వెండి, బంగారం ధరలు దిగిరావడంతో, రాబోయే పండగ సీజన్లో కొనుగోళ్లు చేయాలనుకుంటున్న వారికి ఇది పెద్ద ఊరటగా మారింది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి, వెండి ధరల పతనం వివరాలు: శనివారం నాటి హైదరాబాద్ మార్కెట్ ధరలను పరిశీలిస్తే,…
Read More