BunnyVasu : బుక్ మై షోపై బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు:రేటింగ్‌లు ఎందుకు పెడుతున్నారు

Your Business Depends on Our Cinema!' – Bunny Vasu's Strong Warning to BookMyShow

యాప్‌లో సినిమా రేటింగ్స్‌పై బన్నీ వాసు సూటి ప్రశ్నలు జర్నలిస్టుల రివ్యూలు ఉండగా మీ రేటింగ్స్ ఎందుకని నిలదీత ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ సంస్థ ‘బుక్ మై షో’పై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్లు అమ్మే యాప్‌లో అసలు రేటింగ్స్ ఎందుకు పెడుతున్నారంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విధానం వల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే, సినిమాలకు సంబంధించి ఇప్పటికే జర్నలిస్టులు విశ్లేషణాత్మక రివ్యూలు ఇస్తున్నారని, అలాంటప్పుడు ప్రేక్షకులు ఇచ్చే రేటింగ్స్‌తో ప్రత్యేకంగా ప్రయోజనం ఏంటని ఆయన నిలదీశారు. టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే ఒక సినిమా బాగుంది, బాగాలేదు అని రేటింగ్ ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మీరు కూడా సినిమా మీదే ఆధారపడి వ్యాపారం చేస్తున్నారు కదా?…

Read More