కేసీఆర్ ను ట్రంప్ తో పోల్చిన రేవంత్ ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరిక ప్రజలు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపారని వ్యాఖ్య తెలంగాణలో గతంలో ఒక డొనాల్డ్ ట్రంప్ ఉండేవారని, ఆయన పాలన నచ్చకనే ప్రజలు మూకుమ్మడిగా ఓడించి ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ విమర్శలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ‘బిజినెస్ స్టాండర్డ్స్ యాన్యువల్ ఫోరం’ సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “ట్రంప్ లాంటి వ్యక్తుల ఆటలు ఎక్కువ రోజులు కొనసాగవు. వారు రాత్రి కలలో అనుకున్నది పగలు అమలు చేస్తుంటారు.…
Read More