ఐకానిక్ వంతెన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు ఓటింగ్ లో ఎక్కువ మంది మొగ్గుచూపిన డిజైన్ ను ఖరారు చేసిన సీఎం కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ కు అత్యధిక ఓట్లు రాజధాని అమరావతిలో నిర్మించనున్న కేబుల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. అత్యాధునిక సాంకేతికతతో, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు రూ. 2,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఖరారు చేశారు. ఈ వంతెన నమూనా ఎంపిక కోసం గతంలో సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్రజా ఓటింగ్ నిర్వహించగా, అత్యధిక ఓట్లు సాధించిన రెండో నమూనాను ఫైనల్ చేశారు. కూచిపూడి నృత్య భంగిమలో డిజైన్ ఈ వంతెన కూచిపూడి నృత్యంలోని ‘స్వస్తిక హస్త’ ముద్రను పోలి ఉండటం ఒక ప్రధాన…
Read More